![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన గ్యాంగ్ లీడర్ తో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ప్రియాంకకి మాత్రం అవకాశాలకు కొదువ లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలే.. శ్రీకారం, డాక్టర్.
యువ కథానాయకుడు శర్వానంద్ కాంబినేషన్ లో ప్రియాంక చేసిన గ్రామీణ నేపథ్య చిత్రం శ్రీకారం.. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కాబోతోంది. ఇక అదే నెల 26న ప్రియాంక నటించిన తొలి తమిళ చిత్రం డాక్టర్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. ఇందులో కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరో. మరి.. ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ తో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రియాంకకి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి. మొత్తమ్మీద.. ఈ మార్చి నెల ప్రియాంకకి పరీక్షా మాసం కానుందన్నమాట.
కాగా, తాజాగా సూర్యకి జోడీగా ఓ సినిమాలోనూ, శివకార్తికేయతోనే మరో చిత్రం(డాన్) లోనూ నటించేందుకు ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కూడా తమిళ సినిమాలే కావడం విశేషం.
![]() |
![]() |