![]() |
![]() |
.webp)
భీమ్లా నాయక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ.70 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటిన ఈ సినిమా రాబొయ్యే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టి రికార్డులు తిరగ రాసేలా ఉంది.
రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ మూవీ 108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.36.37 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు, మూడో రోజు కూడా జోరు చూపించింది. రెండో రోజు వరల్డ్ వైడ్ గా 16.09 కోట్ల షేర్ రాబట్టిన భీమ్లా నాయక్ మూడో రోజు 16.73 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. మూడు రోజుల్లో మొత్తం 69.19 కోట్ల షేర్ రాబట్టింది. భీమ్లా నాయక్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 38.81 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
భీమ్లా నాయక్ ఓవర్సీస్ లో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటింది. అక్కడ 9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన మూవీ మూడు రోజుల్లో 10.02 కోట్లు కలెక్ట్ చేసి లాభాల బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ మూడు రోజుల్లో 53.07 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణలో 25.88కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 27.19కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. ఏపీలో టికెట్ ధరలు తక్కువగా లేకుండా ఉండే ఈ మూవీ మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేసేది.
![]() |
![]() |