![]() |
![]() |

వాయిదా పడుతుందనుకున్న పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ ఊహించని విధంగా ఫిబ్రవరి 25 న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. 'భీమ్లా నాయక్' వాయిదా పడటం ఖాయమన్న ప్రచారంతో పలువురు యంగ్ హీరోలు ఫిబ్రవరి 25 న తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ పవర్ స్టార్ సడెన్ ఎంట్రీతో ఊహించని షాక్ తగిలింది. 'భీమ్లా నాయక్' దెబ్బకి శర్వానంద్ నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' వాయిదా పడింది. ఈ మేరకు తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న విడుదల కావడం కష్టమనే వార్తల నేపథ్యంలో.. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'తో శర్వానంద్, 'గని' సినిమాతో వరుణ్ తేజ్, 'సెబాస్టియన్'తో కిరణ్ అబ్బవరం అదే తేదీకి ప్రేక్షకులను పలకరించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా 'ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ విడుదల' అని ప్రకటన రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు వాయిదా పడే అవకాశముందని వార్తలొచ్చాయి. తాజాగా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీమ్ తమ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూవీ మార్చి 4 న థియేటర్స్ లో విడుదల కానుందని పేర్కొంది. 'భీమ్లా నాయక్' దెబ్బకి 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' వారం వెనక్కి వెళ్ళిందన్నమాట.

గతంలో 'ఎక్స్ ప్రెస్ రాజా', 'శతమానం భవతి' వంటి సినిమాలను స్టార్ హీరోల సినిమాలకు పోటీగా విడుదల చేసి శర్వానంద్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. దీంతో 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాను కూడా అలాగే విడుదల చేస్తాడని భావించారంతా. కానీ ఈసారి శర్వానంద్ వెనక్కి తగ్గాడు.
కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో రాధిక, ఖుష్బూ కీలక పాత్రలలో నటించారు.
![]() |
![]() |