![]() |
![]() |

ఫిబ్రవరి 21 న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్, స్పెషల్ గెస్ట్ గా మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారని తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేది.
'భీమ్లా నాయక్' ట్రైలర్ ని ఫిబ్రవరి 21 న విడుదల చేస్తున్నట్లుగా తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పవన్ బైక్ మీద వెళ్తుండగా చుట్టూ ఉన్న జనం చేతులెత్తి దణ్ణం పెట్టడం ఆ పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ ట్రైలర్ పేరిట ట్విట్టర్ లో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ రావడం ఖాయమంటున్నారు. మరి ఈ ట్రైలర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 25 న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |