![]() |
![]() |

మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మా ఎన్నికల సమయంలో మొదలైన ఈ ట్రోల్స్ 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా టైంకి విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మోహన్ బాబు, మంచు విష్ణుపై దారుణంగా ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఈ ట్రోల్స్ కి అడ్డుకట్ట వేయడానికి మంచు టీమ్ రంగంలోకి దిగింది. తమపై వేసిన ట్రోల్స్ ని తొలగించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలోని పలు పేజెస్ కి నోటీసులు పంపింది.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద ట్రోల్స్ రావడం సహజం. కానీ మంచు ఫ్యామిలీ మీద కొంతకాలంగా మరీ దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. మోహన్ బాబు, విష్ణు ఏం మాట్లాడినా ట్రోల్ కి గురవుతున్నారు. ఇక 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో ఈ ట్రోల్స్ మరింత పెరిగిపోయాయి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవల మోహన్ బాబు అయితే ఈ ట్రోల్స్ వెనక ఇద్దరు హీరోలు ఉన్నారని, ఈ ట్రోల్స్ తమకి బాధ కలిగిస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ ట్రోల్స్ ఆగడంలేదు. సోషల్ మీడియా నిండా మంచు ఫ్యామిలీ గురించే ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజెస్ మంచు ఫ్యామిలీని బాగా టార్గెట్ చేశాయి. దీంతో మంచు ఫ్యామిలీ లీగల్ చర్యలకు దిగడానికి సిద్ధమైంది.

మంచు ఫ్యామిలీకి చెందిన 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి పలు యూట్యూబ్ ఛానల్స్ కి, సోషల్ మీడియా పేజెస్ కి నోటీసులు వెళ్లాయి. తమపై చేసిన అవమానకరమైన ట్రోల్స్ ని వెంటనే తొలగించాలని, లేదంటే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. అంతేకాదు పది కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈ నోటిసులతోనైనా మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి.
![]() |
![]() |