![]() |
![]() |

`పడి పడి లేచె మనసు`, `రణరంగం`, `జాను`, `శ్రీకారం`, `మహా సముద్రం` వంటి ఐదు వరుస పరాజయాల అనంతరం యువ కథానాయకుడు శర్వానంద్ నుంచి రాబోతున్న సినిమా `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. స్టార్ బ్యూటీ రష్మికా మందన్న కథానాయికగా నటించిన ఈ సినిమాలో అలనాటి అగ్ర కథానాయికలు రాధిక, ఖుష్బూ, ఊర్వశి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.
ఇదిలా ఉంటే, తొలుత ఈ సినిమాని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ తేదికి `భీమ్లా నాయక్` రావడం పక్కా కావడంతో.. తాజాగా మార్చి 4కి వాయిదా వేశారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మార్చి 6 శర్వానంద్ పుట్టిన రోజు. అంటే.. శర్వా బర్త్ డే కి రెండు రోజుల ముందు `ఆడవాళ్ళు మీకు జోహార్లు` విడుదల కానుందన్నమాట. మరి.. ఫస్ట్ టైమ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనైనా.. శర్వానంద్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
![]() |
![]() |