![]() |
![]() |

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కి పెట్టింది పేరు.. దర్శకుడు ఎ. కరుణాకరన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కరుణాకరన్ తెరకెక్కించిన ఏకైక చిత్రం `డార్లింగ్` కూడా అచ్చంగా ఆ తరహా సినిమానే. ఇందులో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించగా శ్రద్ధా దాస్, ప్రభు, తులసి, చంద్రమోహన్, ముకేష్ రిషి, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం, శ్రీనివాస రెడ్డి, ప్రభాస్ శ్రీను, వంశీకృష్ణ, మాస్టర్ గౌరవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం `డార్లింగ్`కి ప్రధాన బలంగా నిలిచాయి. ఇందులోని ``ఇంకా ఏదో``, ``నీవే నీవే``, ``ప్రాణమా`` అంటూ సాగే మెలోడీస్ ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. `బెస్ట్ ఎడిటర్` (కోటగిరి వెంకటేశ్వరరావు), `బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్` (ఆర్. సి. ఎం. రాజు) విభాగాల్లో `నంది` పురస్కారాలు అందుకున్న `డార్లింగ్`.. కన్నడంలో `బుల్ బుల్`, ఉర్దూలో `దిల్ దివానా` పేర్లతో రీమేక్ అయింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన `డార్లింగ్`.. 2010 ఏప్రిల్ 23న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 12 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |