![]() |
![]() |

'లైగర్' మూవీ తర్వాత 'జెజిఎమ్' (జనగణమన) సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మూవీలో విజయ్ జోడీగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనిపై పెదవి విప్పింది జాన్వీ. లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'జెజిఎమ్'లో తాను చేస్తున్నదీ, లేనిదీ వెల్లడించింది.
"వదంతుల్ని నమ్మకండి. ఇంతదాకా నేను ఏ తెలుగు సినిమాకి కానీ, తమిళ సినిమాకి కానీ సంతకం చేయలేదు. ఏదైనా సినిమాకి సంతకం చేస్తే, ఆ విషయాన్ని నేను కానీ, ఆ నిర్మాణ సంస్థ కానీ ధ్రువీకరిస్తాం" అని చెప్పింది. దాన్ని బట్టి ఆమె 'జెజిఎమ్'కు ఇంత దాకా సంతకం చేయలేదనే విషయం స్పష్టమైపోయింది.
ప్రస్తుతం జాన్వీ హిందీలో 'బవాల్' అనే సినిమా చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరో. ఇప్పటికే ఆమె 'గుడ్ లక్ జెర్రీ', 'మిలి' సినిమాలను పూర్తి చేసింది. అవి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ఈ ఏడాది ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
![]() |
![]() |