![]() |
![]() |

'బుల్లెట్ బండి' ఫోక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మారుమోగిపోయింది. ఇప్పటికి కూడా ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా 'బుల్లెట్' అంటూ మరో సాంగ్ వచ్చింది. స్టార్స్ పనిచేసిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ది వారియర్'. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి 'బుల్లెట్' అనే సాంగ్ తాజాగా విడుదలైంది. డీఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ ఎనర్జిటిక్ గా ఉంది. కోలీవుడ్ హీరో శింబు ఈ సాంగ్ పాడటం విశేషం. గతంలో తెలుగులో 'డైమండ్ గర్ల్(బాద్ షా)', 'బుజ్జి పిల్ల(పోటు గాడు)' వంటి సాంగ్స్ పాడిన శింబు.. మరోసారి తన వాయిస్ తో మెప్పించాడు. శింబుతో కలిసి హరిప్రియ ఆలపించిన ఈ సాంగ్ శ్రీమణి క్యాచీ లిరిక్స్ అందించాడు.

ఇక ఈ సాంగ్ లిరికల్ వీడియోలో రామ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ హీరోలలో టాప్ డాన్సర్స్ లో ఒకడిగా పేరున్న రామ్ మరోసారి అదరగొట్టాడు. ఇక కృతి శెట్టి కూడా తగ్గేదేలే రామ్ ని మ్యాచ్ చేస్తూ స్టెప్స్ వేసి ఆశ్చర్య పరిచింది.
![]() |
![]() |