![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మూడో ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. తాజాగా 1100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది.
నిన్నటితో నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. విడుదలైన రోజు నుంచే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నాలుగు వారాల్లో నైజాంలో 110.08 కోట్లు, సీడెడ్ లో 50.23 కోట్లు, ఆంధ్రాలో 104.6 కోట్ల షేర్ రాబట్టింది. 28 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.264.91 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 400 కోట్ల గ్రాస్ రాబట్టిన మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

ఇక వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 28 రోజుల్లో ఓవరాల్ గా 592.59 కోట్ల షేర్(1097.30 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. నేడు ఈ సినిమా 1100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటిదాకా దంగల్(1958 కోట్లు), బాహుబలి2(1810 కోట్లు) మాత్రమే 1100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. అలాగే ఈ వీకెండ్ లో 600 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకునే అవకాశముంది.
![]() |
![]() |