Home

»

Latest News

26 కోట్లు ఎగ్గొట్టారు.. హీరో రాజశేఖర్ త్వరలో జైలుకి!

Apr 22, 2022 6:07PM

సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న భార్య జీవితా రాజ‌శేఖ‌ర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. 'గ‌రుడ వేగ' సినిమా కోసం రూ.26 కోట్లు తీసుకొని ఎగ్గొట్టారంటూ జోస్టర్ ఫిల్మ్ స‌ర్వీసెస్ వారిపై సంచలన ఆరోపణలు చేసింది.

రాజశేఖర్ దంపతుల తమను మోసం చేశారంటూ జోస్టర్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. 'గరుడ వేగ' నిర్మాణం కోసం వారి ఆస్తులను తాకట్టు పెట్టుకొని 26 కోట్లు అప్పుగా ఇచ్చానని తెలిపారు. అయితే అప్పు ఎగ్గొట్టి, తాకట్టు పెట్టిన ఆస్తులను బినామీ పేర్ల మీదకు మార్చుకొని దంపతులిద్దరూ తనను మోసం చేశారని ఆరోపించారు. వీరిపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు ఉన్నాయని, నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది అన్నారు. రాజశేఖర్ త్వరలో జైలుకెళ్లడం ఖాయం అని కోటేశ్వరరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు జోస్టర్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు చేసిన ఆరోపణలను జీవితా రాజ‌శేఖ‌ర్ ఖండించారు. "మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై రేపు (ఏప్రిల్ 23) జరగబోయే 'శేఖర్' సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తా. అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని మనవి." అంటూ ఆమె ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com