Home

»

Gossips

వెంకీ అట్లూరి బిగ్ స్కెచ్.. ఆ స్టార్ హీరోతో పోలీస్ స్టోరీ.!

Jul 30, 2026 1:14PM

కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'సార్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మళ్లీ ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం జతకట్టబోతోందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో ధనుష్ తొలిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. తన వైవిధ్యమైన నటనతో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన ధనుష్, ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్‌గా నటించకపోవడం విశేషం. అందుకే ఈసారి ఆయన ఖాకీ యూనిఫాం ధరిస్తున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ కోసం ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ కాన్సెప్ట్ తో కూడిన కథను సిద్ధం చేశారని టాక్. ఎమోషనల్ డ్రైవ్‌తో పాటు పక్కా కమర్షియల్ హంగులను మేళవించి ధనుష్‌ను సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి స్క్రిప్ట్ డిజైన్ చేశారని తెలుస్తోంది. 

'సార్' సినిమా తర్వాత మళ్లీ ఒక బలమైన లైన్‌తో వెంకీ అట్లూరి సంప్రదించగానే ధనుష్ కూడా వెంటనే ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబో అప్‌డేట్‌పై నెటిజన్లు విశేషంగా చర్చించుకుంటున్నారు. ఒక వైవిధ్యమైన నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రను తనదైన శైలిలో ఎలా పోషిస్తారో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Dhanush, Venky Atluri, Vishwanath and Sons

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com