
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సినిమా 'శ్రీనివాస మంగాపురం'. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా నిన్న(జూలై 30) థియేటర్లలో అడుగుపెట్టింది. సినిమా టాక్ పరవాలేదు అనేలా ఉన్నా.. హీరోగా జయకృష్ణకు మంచి మార్కులే పడ్డాయి. యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుందని.. సరైన స్క్రిప్ట్స్ పడితే హీరోగా నిలదొక్కుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే జయకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ ఘట్టమనేని వారసుడి రెండో సినిమా లాక్ అయినట్లు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని అయిన ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించనున్నారని టాక్.
'సామజవరగమన', 'నారీ నారీ నడుమ మురారి' సినిమాల దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన శ్రీవిష్ణుతో ఒక సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు.
Jaya Krishna Ghattamaneni, Srinivasa Mangapuram, Anil Sunkara






