Home

»

Gossips

కియారా అద్వానీకి షాక్: రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ.!

Aug 18, 2026 6:55PM

'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ #RC17 తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్ ఎంపికకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించింది. 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాల తర్వాత చరణ్-కియారా కాంబో మరోసారి రిపీట్ అవ్వబోతోందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. హీరోయిన్ విషయంలో ఊహించని బిగ్ చేంజ్ జరిగిందని తెలుస్తోంది.

సుకుమార్ అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం కియారా అద్వానీని పక్కన పెట్టి, ఒక సరికొత్త ఫ్రెష్ పెయిరింగ్ కోసం అన్వేషిస్తున్నారట. ఇందులో భాగంగానే 'ధురంధర్' సినిమాలో 'యలీనా' పాత్రలో తన నటనతో, క్యూట్‌నెస్‌తో మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టి, అందరి దృష్టినీ ఆకర్షించిన సారా అర్జున్ పేరును సుకుమార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లు కేవలం గ్లామర్‌కే పరిమితం కావు.. కథను నడిపించేంత పవర్‌ఫుల్ ఎమోషన్ వాళ్ల పాత్రల్లో ఉంటుంది. అందుకే ఒక యంగ్ అండ్ ప్రామిసింగ్ ఫేస్‌తో రామ్ చరణ్‌ని స్క్రీన్ పై పెయిర్ చేస్తే, ఆ ఫ్రెష్‌నెస్ సినిమాకే పెద్ద ప్లస్ అవుతుందని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.

 

 

 

RC17 Movie, Ram Charan, Sara Arjun, Sukumar, Kiara Advani

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com