
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరో కీలక అడుగు వేయబోతున్నారు. హీరోగా పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్న తారక్.. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారి సొంతంగా ఒక నయా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే తారక్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఎంతలా వైరల్ అయిందో మనందరం చూశాం. అయితే ఇప్పుడు అంతకు మించిన ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఒక బ్రాండ్ న్యూ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట.
ఎన్టీఆర్ (NTR) అనే పేరులోని పవర్, ఎంటర్‌టైన్ (ENTERTAIN) అనే పదంలోని మ్యాజిక్‌ను కలుపుతూ.. 'ఎన్టీఆర్ టైన్' NTRTAIN అనే బ్యానర్ నేమ్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తారక్ నటిస్తున్న ప్రాజెక్ట్స్ అన్నింటికీ తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్‌కి చెందిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మరి అలాంటప్పుడు తారక్ సొంతంగా ఈ కొత్త బ్యానర్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నట్లు? ఈ 'NTRTAIN' బ్యానర్ కళ్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' ను రీప్లేస్ చేయబోతుందా? లేక తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చే యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్ ఈ ప్రత్యేకమైన అడుగు వేస్తున్నారా? అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
మరి ఎన్టీఆర్ నిజంగానే నిర్మాతగా మారబోతున్నారా? ఒకవేళ నిజమైతే 'NTRTAIN' బ్యానర్ నుంచి వచ్చే మొదటి సినిమా ఏంటి? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Jr NTR, New Banner, NTRTAIN






