Home

»

Gossips

అనిల్ ప్లాన్ః బాల‌య్య‌తో మ‌రోసారి ప్రియ‌మ‌ణి రొమాన్స్ !?

May 26, 2022 3:21PM

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో ప్రియ‌మ‌ణి ఒక‌రు. 2009లో విడుద‌లైన‌ `మిత్రుడు`లో ఈ ఇద్ద‌రు జంట‌గా ఎంట‌ర్టైన్ చేశారు. క‌ట్ చేస్తే.. 13 ఏళ్ళ త‌రువాత బాల‌య్య‌, ప్రియ‌మ‌ణి మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. తండ్రి - కూతురు క‌థ‌గా రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో న‌డి వ‌య‌స్కుడైన తండ్రిగా బాల‌య్య ద‌ర్శ‌న‌మివ్వ‌నుండ‌గా.. కూతురి పాత్ర‌లో `పెళ్ళి సంద‌-డి` ఫేమ్ శ్రీ‌లీల క‌నిపించ‌నుంది. కాగా, ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కి జంట‌గా, శ్రీ‌లీల‌కి అమ్మ‌గా ప్రియ‌మ‌ణిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే బాల‌య్య - అనిల్ రావిపూడి కాంబో మూవీలో ప్రియ‌మ‌ణి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. బాల‌కృష్ణ - ప్రియ‌మ‌ణి జోడీ ఈ సారైనా స‌క్సెస్ అందుకుంటుందేమో చూడాలి.

కాగా, బాల‌య్య ప్ర‌స్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చేస్తున్నారు. ఇందులో బాల‌య్యకి జ‌త‌గా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. మ‌రోవైపు.. అనిల్ రావిపూడి తాజా చిత్రం `ఎఫ్ 3` రేపు (మే 27) థియేట‌ర్స్ లోకి రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com