మళ్ళీ నాని దర్శకుడితోనే విజయ్ దేవరకొండ!
on May 25, 2022
2020 ఫిబ్రవరిలో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ రెండేళ్లుగా ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేదు. ఈ గ్యాప్ ని ఇప్పుడు వరుస సినిమాలతో భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'లైగర్' షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమా ఆగష్టు 25న విడుదల కానుంది. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత పూరి దర్శకత్వంలోనే 'జనగణమన' అనే మరో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు లో రిలీజ్ కానుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ మరో సినిమాకి గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విజయ్ వరుసగా నాని దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. నాని హీరోగా నటించిన 'నిన్ను కోరి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ.. తన మూడో సినిమా 'టక్ జగదీష్' కూడా నానితోనే చేశాడు. ఇప్పుడు తన నాలుగో సినిమా ఖుషిని విజయ్ తో చేస్తున్నాడు. అలాగే 'అష్టా చమ్మా'తో నానిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఇప్పుడు విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'అష్టా చమ్మా'తో పాటు 'జెంటిల్ మన్', 'V' ఇలా పది సినిమాలలో మూడు సినిమాలు నానితో చేసిన ఇంద్రగంటి.. ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో బిజీగా ఉన్నాడు.
ఇటీవల ఇంద్రగంటి ఒక స్టోరీ చెప్పగా.. విజయ్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశముందని సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
