Home

»

Gossips

`స్పిరిట్` కోసం ప్ర‌భాస్ షాకింగ్ రెమ్యూన‌రేష‌న్?

Oct 18, 2021 10:38AM

చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న అగ్ర క‌థానాయ‌కుల్లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఒక‌రు. `రాధే శ్యామ్`, `స‌లార్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్`.. ఇలా ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. వీటిలో `రాధేశ్యామ్`, `స‌లార్`, `ఆదిపురుష్` 2022లో విడుద‌ల కానుండ‌గా.. `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్` 2023లో సంద‌డి చేయ‌నున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ గా తెర‌కెక్క‌నున్న `స్పిరిట్`కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఏకంగా 8 భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ పాన్ - వ‌ర‌ల్డ్ మూవీ కోసం ప్ర‌భాస్ అక్ష‌రాలా రూ. 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నార‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. టాలీవుడ్ స్టార్స్ లో రూ. 150 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న తొలి స్టార్ గా ప్ర‌భాస్ నిలిచే అవ‌కాశ‌ముంది. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `స్పిరిట్`ని `అర్జున్ రెడ్డి`, `క‌బీర్ సింగ్` చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించ‌నుండ‌గా.. బాలీవుడ్ దివా క‌రీనా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com