Home

»

Gossips

ప్రభాస్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్: మూడు భారీ సినిమాలు వెనక్కి.!

Sep 9, 2026 6:28PM

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. హను రాఘవపూడితో తెరకెక్కుతున్న 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగాతో తీస్తున్న 'స్పిరిట్', నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'కల్కి-2'.. ఇలా ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. అయితే, ఫిలిం సర్కిల్స్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, 'ఫౌజీ' చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి 'ఫౌజీ' మూవీ ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా, వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఫౌజీ సినిమా సమ్మర్ రేస్‌లోకి దిగితే.. ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ పై ప్రభావం పడనుంది. 

ఎందుకంటే 'ఫౌజీ' వస్తే.. అదే సమ్మర్ స్లాట్‌పై కన్నేసిన సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా అక్కడ నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న 'స్పిరిట్' మూవీ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ, ఫౌజీ డేట్స్ అడ్జస్ట్‌మెంట్ వల్ల స్పిరిట్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఫౌజీ, స్పిరిట్ పోస్ట్‌పోన్ అయితే, ఆ ప్రభావం నేరుగా సైన్స్ ఫిక్షన్ వండర్ 'కల్కి-2' పై పడుతుంది. కల్కి పార్ట్-1 తెచ్చిపెట్టిన భారీ విజయం తర్వాత పార్ట్-2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం చూస్తే.. 2028లో కల్కి-2 సినిమా వస్తే అదే గొప్ప విషయం అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

 

 

 

[Prabhas Lineup, Prabhas Movies, Fauzi Movie, Spirit Movie, Kalki 2 Movie, Hanu Raghavapudi, Sandeep Reddy Vanga, Nag Ashwin, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com