Home

»

Gossips

రామ్‌ చ‌ర‌ణ్‌కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే!

Jul 17, 2026 3:54PM

 


రంగస్థలంతో తెలుగు సినిమాకి సరికొత్త సొగసుని అద్దారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్. దీంతో ఆ ఇద్దరు కలిసి చేస్తున్న RC17 (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.  తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే కథగా ప్రచారం జరుగుతుండగా అక్టోబర్ లో లాంచింగ్ ఉంటుందనే టాక్ వినపడుతుంది.

ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బలంగా, రా అండ్ రస్టిక్ గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే  తెలంగాణ బ్యాక్‌డ్రాప్ రూటెడ్ స్టోరీకి భాగ్యశ్రీ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. మరి సుకుమార్ భావిస్తున్నట్టుగా ఏ క్యారక్టర్ లో అయినా ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇవ్వగలదని భాగ్యశ్రీ నిరూపిస్తూ ఉంది. ఉదాహరణకి గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కి విజయదుందుభి మోగిస్తున్న లెనిన్. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి భాగ్యశ్రీ బోర్సే కనుక  చరణ్ మూవీలో  ఫైనలైజ్ అయితే, ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్లడం ఖాయం. 

Also read: జన నాయగన్ దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్న చిత్రాలు ఇవే! 

ఈ వార్త విన్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో #RC17 కాస్టింగ్ పై జోరుగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. భాగ్యశ్రీ గ్లామర్, చరణ్ మాస్ ఇమేజ్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వెర్షన్స్ ని లాక్ చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులని  90% పూర్తి చేసినట్లు టాక్ వస్తోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తుంది.

ram charan, Bhagyashri Borse, sukumar, mythri movie makers

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com