చైతూకి జోడీగా `ఏజెంట్` భామ!?
on May 28, 2022
అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ తో జోడీకట్టిన కథానాయికలుగా నిధి అగర్వాల్, పూజా హెగ్డే ప్రత్యేక గుర్తింపు పొందారు. చైతూతో `సవ్యసాచి`లో జట్టుకట్టిన నిధి.. ఆపై అఖిల్ తో `మిస్టర్ మజ్ను`లో రొమాన్స్ చేసింది. ఇక చైతన్య `ఒక లైలా కోసం`తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజ.. రీసెంట్ గా అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో సందడి చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు నిధి, పూజ వరుసలో మరో నాయిక చేరబోతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ కెప్టెన్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. చైతూ సరసన అఖిల్ `ఏజెంట్`తో కథానాయికగా తొలి అడుగేస్తున్న సాక్షి వైద్యని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే చైతన్య - వెంకట్ ప్రభు కాంబో మూవీలో సాక్షి వైద్య ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, అఖిల్ `ఏజెంట్` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ ఆగస్టు 12న రిలీజ్ కాబోతోంది. మరోవైపు.. `థాంక్ యూ`తో జూలై 8న, `లాల్ సింగ్ ఛద్దా`తో ఆగస్టు 11న పలకరించబోతున్నాడు చైతూ.