Home

»

Gossips

వెంకీ అట్లూరితో ఎన్టీఆర్ మూవీ.. నాగవంశీ కొత్త స్కెచ్.!

Jul 7, 2026 10:01AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' చేయనున్నాడు. అయితే ఈ రెండు భారీ సినిమాల నడుమ.. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు వెంకీ అట్లూరితో ఎన్టీఆర్ ఒక సినిమా చేసే అవకాశం ఉందన్న వార్త ఆసక్తికరంగా మారింది.

ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరి కల్లా పూర్తయ్యే అవకాశముంది. మరోవైపు త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం తాను చేసున్న 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ లో పూర్తి కానుండగా, ఆ తర్వాత తన పూర్తి ఫోకస్ ను 'గాడ్ ఆఫ్ వార్' పైకి షిఫ్ట్ చేయనున్నాడు. అయితే ఇది వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించనున్నారు. త్రివిక్రమ్ కి ఇది మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్, పైగా ఆయనకు ఇంతవరకు వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన సినిమాలు చేసిన అనుభవం లేదు. అందుకే ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం కేటాయించి, పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్లాలని చూస్తున్నారట. అందుకే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.

నిజానికి ఈ పాన్ ఇండియా సినిమాల నడుమ.. తక్కువ టైంలో పూర్తయ్యే ఒక సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత నాగవంశీ.. ఎన్టీఆర్-వెంకీ అట్లూరి కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడట. 

వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చేస్తున్నాడు. ఆ తర్వాత నానితో సినిమా చేసే అవకాశముంది. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తెరపైకి రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్ కి వెంకీ అట్లూరి చెప్పిన స్టోరీ ఐడియా నచ్చిందని, త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ వింటాడని టాక్. అన్ని అనుకున్నట్టు కుదిరితే 'గాడ్ ఆఫ్ వార్'కి ముందు వెంకీ అట్లూరితో ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.!

 

 

Jr NTR, Dragon, God of War, Venky Atluri, Naga Vamsi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com