
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
తొలుత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధికారికంగా ప్రకటించారు. కానీ, ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. గత కొంత కాలంగా ఎలాంటి అధికారిక అప్‌డేట్స్ కూడా రాకపోవడంతో.. ఇక ఆ సినిమా అటక ఎక్కినట్లే అని అందరూ భావించారు.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇప్పుడొక ఊహించని న్యూస్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ తన కొడుకు అరంగేట్రం కోసం ఒక పక్కా మాస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. బాలయ్యకు సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు ఈ రేస్‌లోకి వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ద్వారా మోక్షజ్ఞను గ్రాండ్ లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నాట. అందుకే బోయపాటి శ్రీను అయితేనే నందమూరి వారసుడిని వెండితెరపై అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించగలరని బాలయ్య బలంగా నమ్ముతున్నారు.
ఈ ఊహించని కాంబినేషన్ వెనుక మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ అయిన 'NBK ఫిలిమ్స్' బ్యానర్‌పైనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారట. మోక్షజ్ఞ కోసం బోయపాటి శ్రీను ఇప్పటికే ఒక అద్భుతమైన, హై-వోల్టేజ్ మాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి బాలయ్యను ఒప్పించారని సమాచారం.
ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక అధికారికంగా లాక్ అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై నందమూరి కాంపౌండ్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Nandamuri Mokshagna, Boyapati Srinu, Nandamuri Balakrishna, TeluguOne




