జూనియర్ ఎన్టీఆర్ ఒక న్యూక్లియర్?
on Jun 11, 2020
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన కూర్చున్నప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో తెలిసిందని.... నెక్స్ట్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఉండాల్సి వచ్చినపుడు రేడియేషన్ సూట్ తెచ్చుకుంటానని కన్నడ దర్శకుడు, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తారక్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పడంలో అతడు క్రియేటివిటీ చూపించాడు. ప్రశాంత్ నీల్ పుట్టినరోజున రేడియేషన్ సూట్ తో రెడీగా ఉండమని మైత్రీ మూవీ మేకర్స్ శుభాకాంక్షలు చెప్పింది.
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేయనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్లో హాలీవుడ్ తరహా కాన్సెప్ట్‌తో పీరియాడిక్ డ్రామాగా ఆ సినిమా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తారక్ 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసి, ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాకి 'న్యూక్లియర్' టైటిల్ పరిశీలనలో ఉన్నదని సమాచారం. అందుకని, ముందునుండి న్యూక్లియర్ ప్లాంట్, రేడియేషన్ సూట్ వంటి పదాలు ఉపయోగిస్తున్నారట. న్యూక్లియర్ కాకపోతే 'మిస్సైల్' టైటిల్ మరో ఆప్షన్ కింద పెట్టుకున్నారట.