Home

»

Gossips

టాలీవుడ్ క్రేజీ కాంబో.. అనిల్ రావిపూడి నెక్స్ట్ హీరో ఎవరో తెలిస్తే షాక్!

May 27, 2026 6:37PM

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు సెట్ అవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక మోస్ట్ అవేటెడ్ క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కలయికలో ఓ ప్రాజెక్ట్ ఖరారైందని సమాచారం. 

గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన 'రాజా ది గ్రేట్' చిత్రం నిజానికి రామ్ పోతినేనితోనే చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మిస్ అయినప్పటికీ, సరిగ్గా 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయిందనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను 2027 దసరా పండుగ కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రామ్ పోతినేని ఎనర్జీకి, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ అప్కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రామ్ పోతినేని తన కెరీర్‌లో 23వ చిత్రాన్ని (RAPO23) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తానే దర్శకుడు కావడం విశేషం. ఈ చిత్రం డిసెంబర్ 2026 నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ పోతినేని పూర్తి స్థాయిలో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. రామ్ తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయని సరికొత్త గెటప్ అండ్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు సమాచారం.

మరోవైపు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ (VenkyAnil5/ NkrAR2) రూపకల్పనలో బిజీగా ఉన్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి 2027 రేసులో నిలిచింది. ఈ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన అనంతరం, అనిల్ రావిపూడి రామ్ పోతినేని సినిమాను ప్రారంభించనున్నారని టాక్. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com