Home

»

Gossips

Mahesh Babu: మహేశ్, ప్రశాంత్ నీల్ ఊహించని కాంబో.. క్రేజీ అప్‌డేట్!

May 26, 2026 3:30PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో  ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని, ఇండస్ట్రీ వర్గాలని ఊపేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్‌ కి  సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ కాంబో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సినీ ప్రియులు, అభిమానులు మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్‌ఫుల్ ఎలివేషన్స్, అద్భుతమైన స్టోరీ నరేషన్,   మహేశ్ వన్ మ్యాన్ షో స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ప్రశాంత్ నీల్ ప్రస్తుతం  మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌(Ntr)తో చేస్తున్న 'డ్రాగన్'(Dragon)తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్ 2' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ టోన్, నియో నాయర్ యాక్షన్ సినిమాలకి  కొంత విరామం ఇచ్చి, మైథాలజికల్ లేదా డిఫరెంట్ జానర్ వైపు అడుగులు వేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రయోగంలో భాగంగానే మహేశ్ బాబు కోసం ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

మహేశ్ ప్రస్తుతం గ్లోబల్ డైరెక్టర్  రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్వ రల్డ్ మూవీ 'వారణాసి'(Varanasi)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 'వారణాసి' తర్వాత మహేశ్ బాబు, సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసే  అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి వచ్చిన సరికొత్త ప్రపోజల్ మహేశ్ బాబుని  ఆలోచనలో పడేసిందని, మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ ని సెట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Also read: VIJay: సీఎం విజయ్‌పై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు..ఏం అర్హత ఉందో ఇప్పుడు అర్థమైందా!

అయితే ఈ ఊహించని కాంబో పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ళ సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే మహేశ్ బాబు 'వారణాసి' ప్రాజెక్ట్‌ కి  ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది.  ప్రశాంత్ నీల్ కూడా 'డ్రాగన్', 'సలార్ 2', మరియు హోంబాలే ఫిలిమ్స్‌తో ఉన్న ఒప్పందాల ప్రకారం 'కేజీఎఫ్ 3' లాంటి భారీ కట్టుబాట్లని  పూర్తి చేయాలి. ఒకవేళ వీరద్దరి షెడ్యూల్స్ అన్నీ అనుకూలించి, కథ లాక్ అయితే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయం. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com