Home

»

Featured News

75 ఏళ్ళ క్రితం రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ‘పాతాళభైరవి’

Mar 14, 2026

1951 మార్చి 15న ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) చిత్రాన్ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. తమిళ్ వెర్షన్ 1951 మే 17న విడుదలైంది. మొదటి మూడు వారాలు ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత క్రమంగా ప్రింట్లు పెరిగాయి, థియేటర్లు పెరిగాయి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘పాతాళభైరవి’ కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు వచ్చిన సినిమాల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించిన తొలి సినిమా ఇదే. 

ఎన్టీఆర్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా 75 ఏళ్ల క్రితమే రజతోత్సవం జరుపుకున్న తొలి సినిమాగా, 200 రోజులు ప్రదర్శింపడిన తొలి చిత్రంగా, ‘పాతాళభైరవి’ రెండు కొత్త రికార్డులు నమోదు చేసింది.. ఆరోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు విజయ సంస్థలో నెలవారీ జీతానికి పనిచేసేవారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సిబ్బందికి మూడు నెలల బోనస్ ప్రకటించారు విజయ అధినేతలు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే విజయ ప్రొడక్షన్స్ సంస్థను మరింత విస్తరించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com