
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఇప్పుడు ఈ పేరు పాన్ ఇండియా వ్యాప్తంగా ఒక బ్రాండ్. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ నిమిషానికి నిమిషం అల్లు అర్జున్ సినిమా రిలీజ్ చేస్తే తొలిరోజే ఆల్ ఓవర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించే మూవీగా నిలుస్తుంది. దీన్ని బట్టి అల్లు అర్జున్ సృష్టించుకున్న సినీ అభిమాన సామ్రాజ్యాన్ని అర్ధం చేసుకోవచ్చు.
కానీ అల్లు అర్జున్ కి కెరీర్ ప్రారంభంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కొడుకుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సెలబ్రిటీ హోదాలోనే ఉన్నా హీరోగా మారాలనే బలమైన కోరికతో ఒక సాధారణ నటుడిలాగే అవకాశాల కోసం స్వయంగా ప్రయత్నించడం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే దర్శకుడు తేజ తెరకెక్కించాలనుకున్న 'జయం' సినిమా ఆడిషన్స్‌కి అల్లు అర్జున్ వెళ్లారు.
కానీ, ఆ ఆడిషన్ సమయంలో బన్నీ రూపాన్ని, లుక్స్ ని ఉద్దేశించి తేజ కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఆ ఆడిషన్‌లో ఎదురైన పరాభవం, తన లుక్స్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అల్లు అర్జున్‌ను మానసికంగా ఎంతో కుంగదీశాయి. ఆ సమయంలోనే బన్నీ వెనుక ఒక కొండలా నిలబడి, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసి, నేటి విజయానికి పునాది వేసిన వ్యక్తి మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. బన్నీ పడిన బాధను చూసి తట్టుకోలేకపోయిన చిరంజీవి, ఆ అవమానాన్ని ఒక సవాల్‌గా మార్చుకోవాలని హితవు పలికారు. అంతేకాదు, తానే స్వయంగా పంతం పట్టి బన్నీకి ఇండస్ట్రీలో ఒక బలమైన డెబ్యూ ప్లాట్‌ఫారమ్ దొరికేలా బాధ్యత తీసుకున్నారు. నిజానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన వందో చిత్రం 'గంగోత్రి' సినిమా కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'డాడీ' సినిమాలో బన్నీకి ఒక చిన్న అవకాశం ఇప్పించారు చిరు. ఆ చిత్రంలోని ఒక క్లబ్ డ్యాన్స్ బిట్‌లో బన్నీ కేవలం 1 నుండి 2 నిమిషాల పాటు కనిపించే చిన్న రోల్ చేశాడు. నిజానికి ఆ క్యారక్టర్ మొదట ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ మాస్టర్ చేయాల్సి ఉంది. కానీ బన్నీలోని అద్భుతమైన డ్యాన్స్ ప్రతిభను ప్రపంచానికి చూపించి, అతనికి ఇండస్ట్రీపై నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో చిరంజీవి లారెన్స్ స్థానంలో బన్నీని తీసుకున్నారు.
Also read: రామ్ చరణ్‌కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే!
ఆ తర్వాతే 2003వ సంవత్సరంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'గంగోత్రి' సినిమా ద్వారా అల్లు అర్జున్ హీరోగా ఘనమైన రీతిలో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి సినిమా విడుదలైన సమయంలో కూడా బన్నీ లుక్స్ పై సానుకూల స్పందన రాలేదు, ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ, మావయ్య చిరంజీవి ఇచ్చిన మానసిక ధైర్యం, ప్రోత్సాహంతో బన్నీ వెనకడుగు వేయలేదు. ఆ పట్టుదలతోనే ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' సినిమాతో టాలీవుడ్‌లోనే కాకుండా మాలీవుడ్ (కేరళ)లోను భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. నాటి నుండి నేటి 'పుష్ప' 2 వరకు 20 ఏళ్లకు పైగా సాగిన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులని దాటుకుంటూ, చివరకు ఉత్తమ నటుడిగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డును సైతం కైవసం చేసుకున్నాడు .
allu arjun, ram charan, gangothri, tollywood




