
బాలీవుడ్ ప్రముఖ నటి జరీన్ ఖాన్(zareen khan)ఇటీవల ముంబైలో జరిగిన ఓ ప్రముఖ బట్టల బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా ఆమె డెనిమ్ జాకెట్, స్టైలిష్ అవుట్‌ఫిట్ ధరించి ఎంతో అందంగా కనిపించారు. కొత్త కలెక్షన్స్‌ని చేతిలో పట్టుకుని అక్కడున్న ఫొటోగ్రాఫర్లకి పోజులిచ్చారు.ఒక ఫోటోగ్రాఫర్ . జరీన్ ఖాన్ బ్రాండ్ దుస్తులను పరిశీలిస్తున్న సమయంలో సదరు ఫొటోగ్రాఫర్ చనువు తీసుకొని, “ఆ డ్రెస్సుని ఇక్కడే మా ముందే ట్రై చేయొచ్చుగా” అంటూ తీవ్ర అసౌకర్యానికి గురిచేసేలా వెకిలి వ్యాఖ్యలు చేశాడు.
ఈ మాట విన్న వెంటనే జరీన్ ఖాన్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యి “ఏంటి.. మీ అందరి ముందే బట్టలు మార్చుకోవాలా? అది ఎప్పటికీ జరగదు. నా దగ్గర ఇలాంటి పిచ్చి వేషాలు, అర్థంలేని ఫాల్తు మాటలు మాట్లాడొద్దు. నన్ను చాలా తక్కువగా అంచనా వేయకండి. మీరంతా మీ మీ పరిధుల్లో, హద్దుల్లో ఉండండి. నేను ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తనని, వెకిలి చేష్టలని సహించే వ్యక్తిని కాదు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చాలా గట్టిగానే క్లాస్ పీకారు. జరీన్ ఖాన్ ఎంతో ధైర్యంగా, స్పష్టంగా ఆ ఫొటోగ్రాఫర్‌కు సమాధానమిచ్చి బుద్ధి చెప్పిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు, సినీ ప్రియులు జరీన్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు మీడియా ఫొటోగ్రాఫర్లు సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, అసభ్యంగా ఎలా మాట్లాడతారంటూ మండిపడుతున్నారు. “ఆమె స్పందించిన తీరు వంద శాతం సరైనది. కెమెరాల ముందు బట్టలు మార్చుకోవాలని అడగడం ఎంతవరకు సమంజసం?” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మహిళా సెలబ్రిటీలు అసౌకర్యంగా అనిపించే ఇటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొని గట్టిగా సమాధానం చెప్పాలో జరీన్ ఖాన్ నిరూపించారని అభినందిస్తున్నారు. గతంలో కూడా నేహా ధూపియా వంటి పలువురు నటీమణులు తమ పట్ల అసభ్యకరంగా వ్యవహరించే పాపరాజ్జీ ప్రవర్తనపై గళం విప్పిన సంగతి తెలిసిందే.
Also read: Ntr: ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్ నుంచి క్రేజీ లీక్! నెట్టింట వైరల్
2010లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘వీర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్, ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్ 2’, ‘హేట్ స్టోరీ 3’, ‘అక్సర్ 2’, ‘1921’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
zareen khan, mumbai




.webp)

