Home

»

Bollywood News

అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై ఫత్వా జారీ.. అసలు ఏం జరిగిందంటే?

Jul 15, 2026 2:48PM

 

అగ్ర హీరో అమీర్ ఖాన్(Aamir Khan)ఈ నెల 5 న ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరుకి చెందిన ప్రముఖ బ్యూటీ అండ్ వెల్నెస్ పారిశ్రామికవేత్త గౌరీ స్ప్రార్ట్‌ని  ముంబైలోని తన నివాసంలో అత్యంత నిరాడంబరంగా, ప్రైవేట్ సివిల్ మ్యారేజ్ ద్వారా మూడో వివాహం చేసుకున్నారు. 25 ఏళ్లకి పైగా పరిచయం ఉన్న వీరిద్దరూ, గత 2023 సంవత్సరం నుండి డేటింగ్ చేస్తూ చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే ఈ వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే ఊహించని రీతిలో పెద్ద వివాదం రాజుకుంది. 

అమీర్ ఖాన్ అంతర్ మత వివాహం (ఇంటర్‌ఫెయిత్ మ్యారేజ్) చేసుకోవడంపై ఉత్తరప్రదేశ్‌కి చెందిన ముస్లిం మత పెద్ద, షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా చౌదరి ఇఫ్రాహిమ్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ముస్లిం వ్యక్తి ఇతర మతాలకి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం షరియా చట్టం ప్రకారం అనుమతించబడదు. ఇది ఇస్లాం నిబంధనలకి విరుద్ధమవ్వడంతో పాటు ఇస్లాం ప్రతిష్టని దెబ్బతీస్తాయని 'ఫత్వా' జారీ చేశాడు

ఈ ఫత్వా వివాదం ఇలా ఉంటే, రాజకీయంగా కూడా ఆమిర్ ఖాన్ పెళ్లి తీవ్ర విమర్శల పాలవుతోంది. మహారాష్ట్ర బీజేపీ మంత్రి నితేష్ రాణే ఈ వివాహాన్ని నేరుగా 'లవ్ జిహాద్' అంశంతో ముడిపెట్టారు. ఆమిర్ ఖాన్ వంటి సెలబ్రిటీలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో హిందూ యువత ఆలోచించుకోవాలని, ఆమిర్ ఖాన్ లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, బీహార్ వంటి పలు ప్రాంతాలలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆమిర్ ఖాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ నిరసనలు చేపట్టారు. గతంలో 2014లో విడుదలైన 'పీకే' సినిమా సమయంలో, అలాగే 2015లో దేశంలో అసహనంపై చేసిన వ్యాఖ్యల వల్ల ఆమిర్ ఖాన్ ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారో, ఇప్పుడు మళ్లీ అదే స్థాయి వివాదం ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుకుంది.


Also read: ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. కర్ణాటక రైట్స్ దక్కించుకున్న తెలుగు ప్రొడ్యూసర్ 

ఈ తీవ్రమైన ఆరోపణలు, ఫత్వా వివాదంపై ఆమీర్ స్పందిస్తు నేను చేసుకున్న   మూడు వివాహాలు పూర్తిగా దేశ సివిల్ చట్టాల (స్పెషల్ మ్యారేజ్ యాక్ట్) ప్రకారమే జరిగాయి. నా మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావుతో పాటు ప్రస్తుత భార్య గౌరీ స్ప్రార్ట్  పెళ్లి కోసం తమ సొంత మతాన్ని వదులుకోని ఇస్లాం మతంలోకి మారలేదు. నా  కుటుంబం ఎల్లప్పుడూ అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పాడు. ఈ వివాదాలన్నింటి మధ్య, ఆమిర్ ఖాన్ తన భార్య గౌరీ, కొడుకు ఆజాద్ మరియు గౌరీ కుమారుడు క్విన్‌లతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. మెల్‌బోర్న్ అంతర్జాతీయ చలనచిత్ర 'సితారే జమీన్ పర్' చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేషన్ పొందిన విషయం తెలిసిందే.

aamir khan, gauri spratt

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com