కంగనా రనౌత్, రాఖీ సావంత్ మధ్య ఇటీవలే ఒక పాడ్‌కాస్ట్ టాక్ షో వివాదం కారణంగా ఘాటైన మాటల యుద్ధం చెలరేగింది. ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాఖీ సావంత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మహిళా రాజకీయ నాయకురాళ్లైన కంగనా రనౌత్, స్మృతి ఇరానీల పొలిటికల్ జర్నీపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్లు మోదీజీకి ఏమి ఇచ్చి మంత్రి పదవులు, అవకాశాలు పొందారో, తానూ అవన్నీ ఇవ్వగలనంటూ రాఖీ చేసిన చౌకబారు కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి.
రాఖీ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చాలా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సమాజంలో ఏ రంగంలోనూ సక్సెస్ కాలేక, నిరాశతో బతికే కొంతమంది వ్యక్తులు.. కష్టపడి పైకొచ్చిన మహిళల క్యారెక్టర్‌ను బలి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మండిపడ్డారు. వాళ్ళ అసూయ, ఈగోలను శాంతింపజేసుకోవడానికే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తారని, ఇకపై మహిళలు ఎవరూ ఇలాంటి దాడులకు లొంగిపోవాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇంతటితో ఆగకుండా రాఖీ సావంత్‌ను ఉద్దేశించి కంగనా తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు సక్సెస్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతావేమో కానీ, నీ దగ్గర నుండి ఎవరికీ ఏమీ అక్కర్లేదు. నువ్వు ఎన్ని ఫేవర్లు చేసినా, నీకున్న క్వాలిటీకి నీకు కనీసం ఒక స్వీపర్ ఉద్యోగం కూడా రాదు, ఎందుకంటే ఆ ఉద్యోగానికి కూడా కొంత టాలెంట్ కావాలి అంటూ రాఖీ కెరీర్‌ను ఎండగట్టారు. చివరిగా.. నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి హాయిగా ఒకచోట కూర్చుని నా రీల్స్ చూస్తూ ఏడుస్తూ ఉండు అంటూ కంగనా ఇచ్చిన రిటార్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కంగనా రనౌత్‌కు తనపై వచ్చే విమర్శలకు ఎప్పుడూ నేరుగా కౌంటర్ ఇచ్చే అలవాటు ఉంది. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఆమె అస్సలు వెనకాడరు. ఈసారి కూడా రాఖీ వ్యాఖ్యలపై ఆమె స్పందించిన తీరు చూస్తుంటే, ఈ వివాదం ఇండస్ట్రీలో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ హాట్ టాపిక్ నెట్టింట నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ విమర్శల పట్ల రాఖీ సావంత్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
[Kangana Ranaut, Rakhi Sawant, Kangana vs Rakhi Sawant, Bollywood News, TeluguOne Movie News]




