సినిమా విడుదలయ్యాక ఎన్ని కోట్లు వసూలు చేస్తుందోనని సాధారణంగా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. కానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ మాత్రం విడుదలకు ముందే భారీ బిజినెస్‌తో వార్తల్లో నిలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ డీల్స్ ద్వారానే సుమారు రూ.665 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
వివరాల్లోకి వెళితే.. ‘కింగ్’ ఓవర్సీస్ పంపిణీ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ రూ.175 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దేశీయ థియేట్రికల్ హక్కులు పెన్ మరుధర్ సంస్థకు రూ.250 కోట్లకు దక్కినట్లు తెలుస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కుల కోసం రూ.150 కోట్లు చెల్లించగా, శాటిలైట్ హక్కులు రూ.25 కోట్లు, మ్యూజిక్ హక్కులు రూ.65 కోట్లకు అమ్ముడైనట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందాలన్నీ కలిపి రూ.665 కోట్లకు చేరినట్లు సమాచారం.
ఇంత భారీ బిజినెస్ వెనుక సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందట. మొదట రూ.200 కోట్లతో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ప్రస్తుతం దాదాపు రూ.400 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. షారుఖ్ రెమ్యునరేషన్, పబ్లిసిటీ, ఇతర ఖర్చులు కలిపితే మొత్తం బడ్జెట్ రూ.500 కోట్లు దాటే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ‘పఠాన్’ తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో షారుఖ్ చేస్తున్న సినిమా కావడం కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది.
ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి నటిస్తుండటం. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. విడుదలకు ముందే ఈ స్థాయిలో బిజినెస్ చేసిన ‘కింగ్’ థియేటర్లలోనూ అదే స్థాయి వసూళ్లు సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
[Shah Rukh Khan King Movie, King Movie Pre Release Business, Shah Rukh Khan King 665 Crores, King Movie Budget, Suhana Khan Debut With Shah Rukh Khan, Siddharth Anand King Movie, King Movie OTT Rights, King Movie Release Date]





