షారుక్ కి కూతురు సుహానా ఖాన్ నుంచి కొత్త తలనొప్పులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
on Sep 3, 2025

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh khan)ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'కింగ్'(KIng)కి సంబంధించిన షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ కూతురు 'సుహానా ఖాన్' (Suhana Khan)కీలక పాత్ర పోషిస్తుంది. స్క్రీన్ పై కూడా తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
సుహానా ఖాన్ ఇటీవల మహారాష్ట్ర లోని 'థాల్' అనే గ్రామంలో 12 .91 కోట్ల రూపాయిల భూమిని తన సొంతం చేసుకుంది. ఈ భూమి వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం కేటాయించిన భూమి. దీంతో అనుమతులు లేకుండా కొనడం చట్ట విరుద్ధమనే ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. సుహానా ని ఈ ప్రాపర్టీ విషయంలో సుమారు 77 లక్షల వరకు స్టాంప్ డ్యూటీ చెల్లించి రైతుగా చేర్పించారు. ఈ విషయానికి కూడా వివాదానికి కారణమయ్యింది.
షారుక్ ఖాన్ ఇటీవల తన ఇంటి నిర్మాణం నిమిత్తం రోడ్ ఆక్యుపై చేస్తే, బొంబాయి మెట్రో పాలిటన్ కార్పొరేషన్ కొన్ని రోజుల క్రితం నోటీసు ఇచ్చింది. ఈ విషయంలో షారుక్ నుంచి సమాధానం రాకపోవడంతో అధికారులు ఈ రోజు మళ్ళీ నోటీసులు ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



