రెండు మర్దర్లు చేసిన ఖైదీతో సంజయ్ దత్ షేవింగ్.. బయటపడిన అసలు నిజం
on Sep 8, 2025

సంజయ్ దత్(Sanjay dutt)నటప్రస్థానం, వాటిల్లో సంజయ్ దత్ నటన గురించి భారతీయ సినీ ప్రేమికులకి క్షుణంగా తెలుసు. నాలుగు దశాబ్దాల క్రితం సినీ రంగంలోకి ప్రవేశించిన సంజయ్ దత్, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ని అందుకోవడంతో పాటు, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్తున్న తన కెరీర్ కి 1993 వ సంవత్సరంలో బ్రేక్ పడింది, ముంబై బాంబుపేలుళ్ల సమయంలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు 'టాడా' కేసు నమోదు కావడంతో జైలు పాలయ్యాడు. ఈ కేసులో పలుమార్లు బెయిల్ పై బయటకి వచ్చి కొన్ని సినిమాల్లో నటించినా కూడా, మొత్తం ఐదు సంవత్సరాలు సంజయ్ దత్ జైలు జీవితాన్ని గడిపాడు.
రీసెంట్ గా సంజయ్ దత్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'(The Great Indian Kapil Show)కి మరో ప్రముఖ హీరో సునీల్ శెట్టి(Sunil shetty)తో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన జీవితంలో చీకటి అధ్యాయంగా మిగిలిన జైలు రోజులని గుర్తు చేసుకున్నాడు. సంజయ్ దత్ మాట్లాడుతు 'జైలు సూపరిండెంట్ తో గడ్డం చేయించమని అడిగితే 'మిశ్రా' (Misra)అనే ఖైదీని ఏర్పాటు చేసారు. మిశ్రా నాకు గడ్డం చేస్తుంటే ఎన్ని సంవత్సరాల నుంచి జైలులో ఉంటున్నావని అడిగాను. పదిహేనేళ్ల నుంచి ఉంటున్నానని చెప్పాడు. ఏ నేరం వలన అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావని అడిగితే, రెండు మర్దర్లు చేసానని చెప్పాడు. ఆ మాట చెప్పే సమయంలో రేజర్ నా మెడ దగ్గరకి వచ్చింది. దాంతో ఒక్కసారిగా మిశ్రా చేయి పట్టుకున్నాను. జైల్లో కుర్చీలు, కాగీతపు సంచులు తయారు చేశాను. వాటికి డబ్బులు కూడా వచ్చాయి. రేడియో స్టేషన్ ఏర్పాటు చెయ్యడంతో పాటు ఖైదీలందరితో కలిసి కొన్ని స్క్రిప్ట్ లు రాసేవాడిని. నేను డైరెక్టర్ గా ఖైదీలు నటులుగా ఉండేవారని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. సంజయ్ దత్ సినీ, జైలు జీవితం గురించి రణభీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ(RajKumar Hirani)దర్శకత్వంలో సంజు(sanju)అనే మూవీ వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అందులో జైలు సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి.
సంజయ్ దత్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే 'ప్రభాస్' అప్ కమింగ్ మూవీ 'దిరాజాసాబ్' లో కీలక పాత్ర ద్వారా మరో సారి పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. సంజయ్ దత్ తల్లి తండ్రులు స్వర్గీయ సునీల్ దత్, నర్గిస్ దత్ హిందీ చలన చిత్ర సీమలో హీరో హీరోయిన్లుగా తమ సత్తా చాటారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



