.webp)
ఓటిటి సినీ ప్రియులు తమ పనులు చేసుకుంటూనే ఈ రోజు ఓటిటిలోకి వచ్చిన మంచి సినిమా ఏంటి? లేదా ఏమైనా మిస్ అయ్యామా అని సెర్చ్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు వాళ్లందరికీ మెస్మరైజ్, భావోద్వేగానికి గురి చేసే ఒక సినిమా ఓటిటిలోకి వచ్చేసింది. పైగా పదమూడేళ్ల తర్వాత. మరి ఆ మూవీ ఏంటో చూసెయ్యండి. దాని గొప్పతనం కూడా తెలుసుకోండి.
'షాహిద్’(Shahid)..ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన బయోలాజికల్ డ్రామా. ప్రస్తుతం ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులోకి వచ్చింది. '2010 ఫిబ్రవరిలో దారుణంగా హత్యకు గురైన మానవ హక్కుల న్యాయవాది, సామాజిక కార్యకర్త షాహిద్ ఆజ్మీ యథార్థ జీవిత ఆధారంగా దీనిని రూపొందించారు. బాల్యంలో 1992 బొంబాయి అల్లర్లలో తీవ్ర మనోవేదనకు గురైన షాహిద్, అన్యాయంగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన నిరుపేదలకు, బాధితులకు న్యాయం అందించేందుకు న్యాయవాదిగా మారతాడు. కేవలం 65 లక్షల రూపాయిల అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో 3.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. ఐఎమ్‌డీబీ (IMDb) లో 8.2/10 రేటింగ్ సాధించి, గ్లోబల్ లెవెల్‌లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో సైతం ప్రీమియర్ ప్రదర్శన పొంది ప్రశంసలు అందుకుంది.
ఇది కూడా చదవండి:Toxic: ఓటీటీ రిలీజ్‌పై మరో ట్విస్ట్.. అక్టోబర్‌లోనురానట్టే.. అసలేం జరుగుతుందంటే?

ఈ సినిమాలో షాహిద్ ఆజ్మీ పాత్రలో ఒదిగిపోయిన రాజ్‌కుమార్ రావు తన అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఆయన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించగా, దర్శకుడిగా హన్సల్ మెహతా జాతీయ స్థాయిలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నారు. మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్, ప్రభ్లీన్ సంధు ముఖ్య పాత్రల్లో కనిపించారు. 2013లో థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించినప్పటికీ, ఇన్ని సంవత్సరాలు ఏ ఓటీటీ వేదికలోనూ ప్రసారం కాకపోవడంపై సినీ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. దర్శకుడు హన్సల్ మెహతా గతంలో ఇది ఒక ‘వ్యక్తిగత విషాదం’ అని వ్యాఖ్యానించగా, రచయిత-ఎడిటర్ అపూర్వ అస్రాని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పొలిటికల్ వాతావరణం, భయంతో కూడిన రాజకీయాల వల్లే ఇన్నాళ్లపాటు ఈ సినిమాకు ఓటీటీ వేదిక దక్కలేదా అని ప్రశ్నించారు.
సో ,విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత 'షాహిద్' ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ఇది కల్పిత కథ కాదు. నిజ జీవితంలో షాహిద్ అనే మనిషి మెదడు పొరల్లో నుంచి ఉద్భవించిన అగ్ని జ్వాల..
[Shahid OTT release, Rajkummar Rao Shahid Movie Ott Release Prime Video, Rajkummar Rao Shahid movie, Hansal Mehta Shahid Prime Video, Bollywood, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]




.webp)
