Home

»

Bollywood News

బీజేపీ ఎంపీపై హృతిక్ రోషన్ సెటైర్లు!  ఏంటి, అది నిజమేనా! 

Sep 29, 2026 6:18PM

 

భారతీయ సినిమాకి సరికొత్త డాన్స్ ని పరిచయం చేసిన వాళ్ళల్లో హృతిక్ రోషన్ ఒకడు. తొలి సినిమా కహోనా ప్యార్ హై తో ఆంద్రప్రదేశ్ విజయవాడలోనే అర్థ శత దినోత్సవం జరుపుకున్నాడు. దీంతో ఆరు సంవత్సరాల పిల్లలు కూడా ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు. వార్ 2 తర్వాత కొత్త సినిమాకి సిద్దమవుతున్నాడు!

భారతీయ జనతా పార్టీ నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు బన్సూరీ స్వరాజ్ గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విసిరిన సవాల్‌కు సంబంధించిన ఒక పాత వీడియోపై  హృతిక్ రోషన్ చేసిన రిప్లై ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం అసలు మూలాలు పరిశీలిస్తే, ఇది ఈ ఏడాది ఆగస్టు 22న మహారాష్ట్రలోని పూణేలో ప్రారంభమైంది. అక్కడ జరిగిన ‘ఛత్రోన్ కీ గూంజ్’ అనే విద్యార్థుల ప్రత్యేక కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. యువతులను, విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ సమాజంలో మహిళలపై జరుగుతున్న అణచివేత, వివక్ష గురించి ప్రస్తావించారు. మన సమాజంలో వేళ్లూనుకున్న పితృస్వామ్య వ్యవస్థ (Patriarchy) మహిళలను భయపెడుతుందని, అణచివేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా "స్మాష్ ది పాట్రియార్కీ" (పితృస్వామ్యాన్ని అంతం చేయాలి) అని పిలుపునిచ్చారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ తీరును తప్పుపడుతూ 'మీకు నిజంగానే పితృస్వామ్యాన్ని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, ముందుగా మీరు ‘వందేమాతరం’ గేయాన్ని (ఆరు చరణాలు) పూర్తిగా పాడి చూపించండి" అంటూ రాహుల్ గాంధీకి ఛాలెంజ్ చేశారు. పితృస్వామ్యానికి, వందేమాతరం గీతానికి ఉన్న సంబంధం ఏమిటో స్పష్టత ఇవ్వకుండానే ఆమె ఈ విధంగా సవాల్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.


ఇది కూడా చదవండి: చిరంజీవి, బాలకృష్ణ మధ్యలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? 

 

 

కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్స్ జాతీయ కన్వీనర్ రుచిరా చతుర్వేది నెల రోజుల క్రితం బన్సూరీ స్వరాజ్ వ్యాఖ్యల వీడియోను ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల్లో షేర్ చేశారు. "అసలు పితృస్వామ్యాన్ని తుడిచిపెట్టడానికి, వందేమాతరం పాడటానికి సంబంధం ఏమిటి?" అని ఆమె ఆ వీడియో క్యాప్షన్‌లో ప్రశ్నించారు. దాదాపు నెల రోజుల పాటు పెద్దగా వార్తల్లో లేని ఈ పాత వీడియోపై తాజాగా హీరో హృతిక్ రోషన్ కంట పడింది. దీనిని చూసిన హృతిక్ రోషన్ అశ్చర్యపోతూ కేవలం ఐదు పదాలతో సెటైరికల్ రిప్లై ఇచ్చారు. (ఏంటి? ఇది నిజమా.. వావ్!) "Huh? Is this real. Wow" అంటు కామెంట్ చేశారు. హృతిక్ రోషన్ చేసిన ఈ ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం.

 

[Hrithik Roshan About Bansuri, Hrithik Roshan, Bansuri Swaraj, Rahul Gandhi Vande Mataram, Smash The Patriarchy, Ruchira Chaturvedi, Bollywood Political Comment, Bollywood]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com