
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి ఉన్న సుదీర్ఘ సినీ హిస్టరీ గురించి ప్రతి భారతీయ సినీ ప్రేమికుడికి తెలిసిందే. ప్రస్తుతం 'కింగ్' మూవీతో బిజీగా ఉన్నాడు.ఇటీవల విడుదలైన 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026' నివేదిక ప్రకారం, ఆయన నెట్ వర్త్ ఒకే ఏడాదిలో గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే షారుఖ్ ఖాన్ ఏకంగా 2,490 కోట్ల ఆస్తిని కోల్పోయారని ఈ తాజా డేటా వెల్లడించింది.
2025 నాటి హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ఆయన నికర ఆస్తి విలువ 12,490 కోట్లుగా నమోదవ్వగా, ఇప్పుడు అది సుమారు 20 శాతం తగ్గి ప్రస్తుతం 10,000 కోట్లకి చేరుకుంది. అయితే, .2,490 కోట్ల మేర సంపద క్షీణించినప్పటికీ, భారతీయ సినిమా రంగంలో అత్యంత సంపన్నుడైన నటుడిగా ఆయన తన అగ్రస్థానాన్ని ఏమాత్రం కోల్పోలేదు. షారుఖ్ ఖాన్ ఆస్తి కేవలం ఆయన సినిమాల రెమ్యూనరేషన్ లేదా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా మాత్రమే కాకుండా, ఇతర వ్యాపారాల ద్వారా కూడా విస్తరించి ఉంది.
ఇది కూడా చదవండి: ఆ సిటీలో చరణ్: RC 17 కోసం కసరత్తుల కోసమేనా!
ఐపీఎల్‌లో విజయవంతమైన ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్' ఆస్తులు కూడా ఈ మొత్తం నెట్ మార్కెట్ లోకి వస్తాయి. లాభాల శాతంలో వచ్చిన తీవ్రమైన హెచ్చుతగ్గులు మరియు వ్యాపార పెట్టుబడుల విలువల్లో మార్పుల వల్లే ఈ భారీ తగ్గుదల నమోదైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో అత్యధిక ఆస్తి కలిగిన నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇతర దిగ్గజ నటులు ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ .4,000 కోట్ల నికర ఆస్తితో రెండవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ 3,000 కోట్ల ఆస్తితో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోగా, బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ హృతిక్ రోషన్ తన ఆస్తిని మరింత పెంచుకుని 2,500 కోట్లతో నాల్గవ స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో ఇతర నటులు తమ ఆస్తులని పెంచుకున్నప్పటికీ, షారుఖ్ ఖాన్‌కి మిగిలిన హీరోల కంటే ఉన్న భారీ వెసులుబాటు వల్ల ఆయన నంబర్ 1 స్థానానికి ఎలాంటి ముప్పు రాలేదు.

[Shah Rukh Khan , Shah Rukh Khan Net Worth Drop 2026, Hurun India Rich List 2026, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne, Bollywood]





