
బాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘లవ్ అండ్ వార్’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ లుక్ వచ్చేసింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రెట్రో స్టైల్‌లో ఉన్న ఈ లుక్‌లో రణ్‌బీర్ వింటేజ్ కారులో కూర్చుని కనిపించారు.
అయితే ఈ పోస్టర్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో అంశం ఉంది. రణ్‌బీర్ ఎడమ చేయి గాయాలతో, రక్తంతో కనిపిస్తోంది. దీంతో సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అసలు ఈ గాయాల వెనుక కథేంటి? అనే ఆసక్తి మొదలైంది.
ఇక ఈ సినిమా సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న మూవీ కావడం మరో ప్రత్యేకత. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘సావరియా’ వచ్చిన విషయం తెలిసిందే. ఆలియా భట్‌తో భన్సాలీకి ఇది రెండో సినిమా.

ఇది కూడా చదవండి: ప్యారడైజ్ చుట్టూ రాజకీయం.. ఒక్క పూటలోనే సీన్ రివర్స్.!
ఇక ‘లవ్ అండ్ వార్’ను 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచిన భన్సాలీ.. ఇక టీజర్, ట్రైలర్‌తో ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
ప్యారడైజ్‌కు పోస్ట్ ప్రొడక్షన్ దెబ్బ.. సినిమాకు అది ఎంత కీలకమో గుర్తించరా.?
55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.!
[Love And War First Look, Ranbir Kapoor First Look, Love & War First Look, Sanjay Leela Bhansali, Ranbir Kapoor, Alia Bhatt, Vicky Kaushal, Telugu Film News, Telugu News]




