Home

»

Bollywood News

సారా టెండూల్క‌ర్‌తో రాజ్‌వీర్ పెళ్లి.. నిజాలు బ‌య‌ట‌పెట్టిన స‌న్నిహితులు.!

Nov 23, 2026 6:37PM

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్ డియోల్‌తో ఆమె వివాహం జరగబోతుందంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు.. 2027లో వీరిద్దరి పెళ్లి జరగనుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో క్రికెట్, సినీ అభిమానుల్లో ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

సచిన్ టెండూల్కర్ కుటుంబానికి, సన్నీ డియోల్ కుటుంబానికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో అసలు విషయం ఏమిటనే చర్చ మొదలైంది. అయితే తాజాగా సారాకు దగ్గరగా ఉండే వ్యక్తులు ఈ వార్తలపై స్పందించారు. సారా, రాజ్‌వీర్ డియోల్ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

అంతేకాదు.. సారా, రాజ్‌వీర్ ఇప్పటివరకు కనీసం ఒకరినొకరు కలుసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం సారా సింగిల్‌గా ఉన్నారని, తన వృత్తిపరమైన పనులపై దృష్టి పెట్టారని వెల్లడించారు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలు అనవసరమైన ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఈ వార్తలపై సారా స్వయంగా స్పందించే అవకాశం కూడా లేదని ఆమెకు దగ్గరగా ఉన్న వ్యక్తులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో సారా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి తనకు ఓ మంచి అనుభవాన్ని ఇచ్చిందని, తన పెళ్లి ఎలా ఉండాలనే దానిపై ఒక అవగాహన వచ్చిందని చెప్పారు. సోదరుడి పెళ్లిని తన భవిష్యత్ వివాహానికి ఓ ట్రయల్ రన్‌గా భావించినట్లు తెలిపారు.

అలాగే తన పెళ్లి గురించి చిన్నప్పటి నుంచి కొన్ని కలలు ఉండేవని, గతంలో గ్రాండ్‌గా వివాహ వేడుక జరగాలని అనుకునేదాన్నని సారా వెల్లడించారు. అయితే ఇప్పుడు మాత్రం సింపుల్‌గా, సన్నిహితుల మధ్య జరిగే పెళ్లి వేడుక అంటే ఇష్టమని చెప్పారు. పెళ్లి దుస్తుల విషయంలో కూడా తన అభిప్రాయాలు మారాయని, సంప్రదాయ ఎరుపు రంగు దుస్తులు ధరించే ఆలోచన కూడా ఉందని గతంలో చెప్పుకొచ్చారు.

ఇక ప్రేమ, పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు సచిన్, అంజలి టెండూల్కర్ బంధమే తనకు ఆదర్శమని సారా తెలిపారు. ఇద్దరి మధ్య స్నేహం, ఒకరిపై మరొకరికి గౌరవం ఉండటం తనకు చాలా ఇష్టమని చెప్పారు. అయితే ప్రస్తుతం రాజ్‌వీర్‌తో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని ఆమెకు దగ్గరగా ఉన్న వ్యక్తులు స్పష్టం చేయడంతో ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.

 

 

 

[SaraTendulkar, RajveerDeol, WeddingRumours, SachinTendulkar, SunnyDeol]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com