Home

»

Bollywood News

'బ్లాక్‌బక్' కేసు సినిమాపై రచ్చ.. స‌ల్మాన్ పంపిన నోటీసును లైవ్‌లో చించేసిన నిర్మాత‌!

Jun 5, 2026 2:32PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జీవితంలోని అత్యంత వివాదాస్పదమైన 'కృష్ణజింకల వేట' (బ్లాక్‌బక్ పోచింగ్) ఉదంతం చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదం ముదిరింది. ఆ నల్లటి మచ్చను ఆధారం చేసుకుని బాలీవుడ్‌లో ‘కాలా హీరన్: ది బాటిల్ ఫర్ లెగసీ’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంపై సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసుల వ్యవహారంపై సదరు చిత్ర నిర్మాత అమిత్ జాని స్పందించిన తీరు ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

లీగల్ నోటీసులు పంపితే సాధారణంగా లాయర్లతో సమాధానం ఇప్పిస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నిర్మాత అమిత్ జాని ఏకంగా లైవ్ కెమెరా ముందే సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ పంపిన నోటీసులను ముక్కలు ముక్కలుగా చింపిపారేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ సంచలన వీడియోను వదిలారు. ఈ ఫేక్ కాగితాల ముక్కలే తను ఇచ్చే రిప్లై అని, ఎవరి బెదిరింపులకూ లొంగి ఈ ప్రాజెక్ట్ ఆపే ప్రసక్తే లేదని ఆయన చాలా ఘాటుగా బస్తీ సవాల్ విసిరారు. చట్టబద్ధంగానే కోర్టులో తేల్చుకుంటామని నేరుగా ఖాన్ గ్రూప్‌నకే సవాల్ చేయడం విశేషం.

ఈ నోటీసుల వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుండి తనకు ప్రాణహాని తలపెట్టేలా తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని నిర్మాత ఆరోపించారు. కేవలం 36 గంటల్లోనే సల్మాన్ ఫ్యాన్స్ పేరుతో దాదాపు 1000కి పైగా బెదిరింపు సందేశాలు వచ్చాయట. ముంబైలో కాలు పెడితే తలలు నరికేస్తామని కొందరు మెసేజ్‌లు పంపుతున్నారని, ఈ పరిస్థితుల్లో తాను లీగల్ నోటీసులకు సమాధానం ఇవ్వాలా లేక ఈ ప్రాణహాని బెదిరింపుల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలా అని ప్రశ్నించారు.

ఇంతటితో ఆగకుండా అండర్ వరల్డ్ మాఫియా ఎంట్రీ గురించి కూడా అమిత్ జాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ డి-కంపెనీ (దావూద్ గ్యాంగ్) నుంచి కూడా తనకు, తన కుటుంబానికి చంపేస్తామనే హెచ్చరికలు వస్తున్నాయని చెప్పారు. ఈ మెసేజ్‌లు పంపే వీధి రౌడీలను, అండర్ వరల్డ్ ముఠాలను తాము ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి బాలీవుడ్ వర్గాలను విస్మయానికి గురిచేశారు.

అసలు ఈ ‘కాలా హీరన్’ చిత్రం 1998 నాటి కృష్ణజింకల వేట కేసుతో పాటు, సల్మాన్ ఖాన్ జైలు జీవితం, తదనంతర కోర్టు డ్రామా, అలాగే ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో నడుస్తున్న సుదీర్ఘమైన వైరానికి సంబంధించిన పూర్తి కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సెన్సేషనల్ సబ్జెక్ట్ కారణంగానే సినిమా అనౌన్స్ అయిన నాటి నుంచే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ అయింది. నిర్మాత ఓపెన్ ఛాలెంజ్ చేయడంపై అటు సల్మాన్ ఖాన్ టీమ్ గానీ, ఆయన లీగల్ ప్రతినిధులు గానీ ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com