భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథాలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ'. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ సారథ్యంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇండియన్ సినిమా హిస్టరీలోనే ముందెన్నడూ లేనంత బిగ్ హైప్ నెలకొంది. తాజాగా ఈ మూవీ పార్ట్-1కి సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
పాన్-ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో తొలి భాగానికి సంబంధించి రన్‌టైమ్ ఎడిటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కథనంలో వేగం, ప్రేక్షకుల్లో ఉత్కంఠ తగ్గకుండా ఉండేందుకు ఎడిటింగ్ టేబుల్ వద్ద దర్శకుడు నితీష్ తివారీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం తొలి భాగం నిడివిని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గించనున్నారట.
సాధారణంగా పౌరాణిక చిత్రాల్లో సన్నివేశాల విస్తృతి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆధునిక ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి సన్నివేశం గ్రిప్పింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కథలో అనవసర సాగదీతలకు చోటు లేకుండా నేరుగా మూల కథలోకి తీసుకెళ్లేలా సీన్లను ట్రిమ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రన్‌టైమ్ కుదింపు వల్ల సినిమా మరింత ఎంగేజింగ్‌గా మారుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ బిగ్ స్క్రీన్ విజువల్ వండర్‌లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతాదేవిగా సాయి పల్లవి కనిపించనున్నారు. ఇక రావణాసురుడిగా యష్ నటిస్తుండడమే కాకుండా, ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇంతటి భారీ తారాగణంతో, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఈ నిడివి తగ్గింపు వార్తపై కూడా నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సాగదీత లేకుండా షార్ప్ అండ్ క్రిస్పీగా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
వరల్డ్ క్లాస్ VFX సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తొలి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అలాగే రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తారు.




