బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్, ఇంటర్నేషనల్ పాప్ ఐకాన్ నోరా ఫతేహి కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించి ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. బాలీవుడ్‌లో గ్లామరస్ క్వీన్‌గా, అద్భుతమైన డ్యాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోరా, ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలోనే బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులకు ఒక పెద్ద కండీషన్ పెట్టి మరీ హౌస్‌లోకి అడుగుపెట్టానని చెప్పారు.
కెరీర్ ప్రారంభంలో అనేక హిట్స్ అండ్ డ్యాన్స్ నంబర్స్ చేసినప్పటికీ, తనకు రావాల్సిన డబ్బులు సకాలంలో అందలేదని నోరా గుర్తుచేసుకున్నారు. నిర్మాతలు ఏజెన్సీలకు పేమెంట్స్ ఇచ్చినా, తన వరకు ఆ డబ్బు రాక తీవ్రమైన ఆర్థిక సమస్యలను అనుభవించానని పేర్కొన్నారు. ఆ సమయంలోనే బిగ్ బాస్ 9 నిర్వాహకుల నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఆఫర్ వచ్చిందని, అయితే తనకు మొదట రియాలిటీ షోస్ చేయడం అస్సలు ఇష్టం లేక ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు.
అయితే ఛానెల్ మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు, ఆ షో ద్వారా ఇంట్లోని ప్రతి ఒక్కరికీ త్వరితగతిన చేరువ కావచ్చు అని నోరా ఆలోచించారట. కానీ అదే సమయంలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడానికి ఒక షరతు విధించారు. అదే ఛానెల్‌లో ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'జలక్ దిఖ్లా జా'లో పాల్గొనడమే తన అసలు లక్ష్యమని, ఆ షోలో అవకాశం ఇస్తేనే బిగ్ బాస్ 9కి ఓకే చెప్తానని తెగేసి చెప్పారు. నిర్వాహకులు ఆ కండీషన్‌కు అంగీకరించడంతోనే 2015 డిసెంబర్‌లో వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టానని తెలిపారు.
బిగ్ బాస్ హౌస్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ, నోరా తన డ్యాన్స్ ప్రతిభతో, క్యూట్ పర్సనాలిటీతో ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నారు. ఆ సీజన్ విజేత ప్రిన్స్ నరులాతో ఆమె ఏర్పరచుకున్న స్నేహం, బాండింగ్ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అనుకున్నట్లే జలక్ దిఖ్లా జా షోలో పాల్గొని తన డ్యాన్స్ స్కిల్స్‌తో మరింత ప్రాచుర్యం పొందారు.
ఒకప్పుడు పేమెంట్స్ కోసం పోరాడి బిగ్ బాస్‌కు కండీషన్ పెట్టిన నోరా ఫతేహి, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో రచ్చ చేస్తున్నారు. ఫీఫా వరల్డ్ కప్ ఈవెంట్‌లో పర్ఫార్మ్ చేయడమే కాకుండా, అంతర్జాతీయ పాప్ ప్రాజెక్టులతో వరుసగా బిజీ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ భారీ ప్రాజెక్టుల్లో తన మార్క్ డ్యాన్స్ నంబర్లతో కుర్రకారును అలరిస్తున్నారు.
తన కెరీర్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను నోరా ఓపెన్‌గా బయటపెట్టడంతో, ఆమె ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఎంతటి కష్టాలు వచ్చినా పట్టుదలతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్న నోరా డెడికేషన్‌ను కాంప్లిమెంట్స్‌తో ముంచెత్తుతున్నారు.
[Nora Fatehi, Bigg Boss 9, Nora Fatehi Bigg Boss Condition, Jhalak Dikhhla Jaa, Nora Fatehi Latest News]




