బెంగాలీలో కొంతకాలం క్రితం ‘బీరాంగన’ పేరుతో ఓ సిరీస్ రూపొందింది. అదే ఇప్పుడు ‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ పేరుతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఏడు ఎపిసోడ్లుగా విడుదల చేశారు. బెంగాలీతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
కోల్‌కతాలో చిత్రా బసు (సందీప్తా సేన్) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉద్యోగం చేయడం అత్తమామలకు ఇష్టం ఉండదు. అయినప్పటికీ భర్త సపోర్ట్‌తో తన విధులను కొనసాగిస్తూ ఉంటుంది. మరోవైపు బాల్యంలో జరిగిన ఓ సంఘటన అప్పుడప్పుడు ఆమెను వెంటాడుతూ ఉంటుంది. దాంతోపాటు తన పైఅధికారి బరల్‌తో కూడా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో వరుసగా వింత మరణాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా పెళ్లి ముహూర్తానికి ముందే వధువులు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. ఈ కేసును పరిష్కరించడానికి చిత్రా బసు తన టీమ్‌తో రంగంలోకి దిగుతుంది. విచారణలో రెండో పెళ్లి చేసుకుంటున్న యువతులే ఈ హత్యలకు గురవుతున్నారని తెలుసుకుంటుంది. అయితే ఈ మరణాలన్నింటికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో పెళ్లి మంటపాల్లో వధువులు చనిపోయిన అన్ని సందర్భాల్లోనూ ఫ్లవర్ డెకరేషన్ చేసింది ఒకే వ్యక్తి అని తెలుస్తుంది. అతడి పేరు చిరాయు. దీంతో అతడిని పట్టుకోవడానికి చిత్రా బసు తన టీమ్‌తో కలిసి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అసలు చిరాయు ఎవరు? రెండో పెళ్లి చేసుకునే యువతులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అతడిని పట్టుకునే క్రమంలో చిత్రా బసుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే ఈ సిరీస్ కథ.
ఇది కూడా చదవండి: పెళ్లయ్యాక అలాంటి పాత్రలు చేయకూడదా? కియారా విషయం సిద్ధార్థ్ ఏమన్నారంటే.?
సాధారణంగా సైకో కిల్లర్ కథల్లో హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అనే విషయాలను చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచుతారు. కానీ ఈ సిరీస్‌లో మాత్రం హంతకుడు ఎవరనేది ముందుగానే చూపించేస్తారు. అతడిని పోలీసులు ఎలా పట్టుకుంటారనే అంశంపైనే కథ నడుస్తుంది.
హత్యల వెనుక ఉన్న కారణాలు, పోలీసుల దర్యాప్తు పెద్దగా ఉత్కంఠను కలిగించలేకపోయాయి. హంతకుడి ఫ్లాష్‌బ్యాక్‌తోపాటు చిత్రా బసు గతానికి సంబంధించిన సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగానే చేసినప్పటికీ, ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కూడా సాధారణంగానే అనిపిస్తాయి.
మీకు నచ్చవచ్చు: ఆస్కార్ రేసులో రామాయణ పార్ట్ 1: ఇండిపెండెంట్ ఎంట్రీ.!
[Madam Inspector Review, Madam Inspector Netflix Series, Madam Inspector Telugu Review, Madam Inspector Story, Sandipta Sen, Nirjhar Mitra, Bengali Crime Thriller, Netflix Crime Thriller, Madam Inspector Rating, Madam Inspector Cast, New OTT Series November 2026]





