రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. షారుఖ్ ఖాన్ రేర్ రికార్డు!
on Sep 25, 2023
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్' రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఏడాది 'పఠాన్'తో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు జవాన్ తో మరోసారి ఆ ఫీట్ సాధించారు షారుఖ్. ఒకే ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు రూ.1000 కోట్ల మార్క్ ని అందుకున్నాయి.
ఇండియన్ సినిమా చరిత్రలో రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా 'బాహుబలి-2' నిలిచింది. ఆ తర్వాత 'దంగల్', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2', 'పఠాన్' ఆ లిస్టులో చేరాయి. ఇప్పటిదాకా ఐదు సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని అందుకోగా, తాజాగా 'జవాన్' ఈ ఫీట్ సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 18 రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
ఇప్పటిదాకా ఆరు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరగా అందులో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండు('బాహుబలి-2','ఆర్ఆర్ఆర్') సినిమాలున్నాయి. హీరోల పరంగా మాత్రం రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న హీరో షారుఖ్ ఒక్కరే. అదికూడా ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలతో అరుదైన రికార్డు సృష్టించారు. ఈ ఏడాది చివరిలో ఆయన నటిస్తున్న 'డుంకీ' విడుదల కానుంది. ఆ సినిమా కూడా వెయ్యి కోట్ల ఫీట్ సాధిస్తే, ఇక ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాల రికార్డు బ్రేక్ కావడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
