
'దృశ్యం' సబ్జెక్ట్ ఎప్పుడైతే రీమేక్ హోదాలో తెలుగు సినీనాట అడుగుపెట్టిందో అప్పట్నుంచే, దృశ్యం సిరీస్ ఏ లాంగ్వేజ్ లో తెరకెక్కినా తెలుగు ప్రేక్షకుల చూపు ఉంటూనే ఉంది.ఈ క్రమంలోనే నిన్న హిందీలో విడుదలైన దృశ్యం 3 ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ ని రాబట్టడంతో దృశ్యం ప్రేమికులు సంబరాలు చేసుకుంటున్నారు
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 95.10 కోట్ల రికార్డు గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్‌కి కూతవేటు దూరంలో ఉండటం విశేషం. ఇండియా గ్రాస్ 80 .10 కాగా ఓవర్ సీస్ 15 కోట్లు. హిందీ సీమ కొన్నాళ్లుగా సరైన ఓపెనింగ్స్ ని రాబట్టడంలో విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు దృశ్యం 3 తో ఆ లోటు తీరిందని చెప్పవచ్చు. 2015లో వచ్చిన తొలి భాగం మొదటి రోజున 5.85 కోట్లు మాత్రమే వసూలు చేయగా, 2022లో వచ్చిన 'దృశ్యం 2' తొలి రోజు 15.38 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. కానీ 'దృశ్యం 3' ఏకంగా రూ. 66.75 కోట్ల నెట్‌తో సింగమ్ ఎగైన్ (రూ. 43.70 కోట్లు), సింగమ్ రిటర్న్స్ (రూ. 32.09 కోట్లు) మరియు గోల్‌మాల్ ఎగైన్ (రూ. 30.14 కోట్లు) వంటి పెద్ద సినిమాల ఓపెనింగ్స్ రికార్డులను తిరగరాసి, అజయ్ దేవ్‌గణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనర్ పొందిన చిత్రంగా కొత్త చరిత్ర సృష్టించింది.
ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ కి వేణుస్వామి ఏం చెప్పాడంటే: జాతకం అంటే ఇదేనా!

అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఆఖరి భాగంలో విజయ్ సాల్గాంకర్ క్యారక్టర్ లో అజయ్ దేవ్‌గణ్ మరోసారి జీవించిపడేసాడు. టబు, శ్రియా శరన్, జైదీప్ అహ్లావత్, రజత్ కపూర్ తమ నటనతో మెప్పించారు. మీరా దేశ్‌ముఖ్, కొత్త ఎస్పీ క్యారెక్టర్స్ మధ్య నడిచే ఉత్కంఠభరితమైన ఎత్తులు పైఎత్తులు, చివరి గంటలో వచ్చే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. టాక్ కూడా పాజిటివ్ గా వస్తుండంతో ఈ వీకెండ్ లోనే 200 కోట్ల మార్కుని అందుకోవడం ఖాయం.
[Drishyam 3 First Day Collections, Drishyam The Conclusion, Ajay Devgn Drishyam 3, Drishyam 3 Worldwide Gross, Drishyam 3 First Day Collection, Drishyam 3 Records, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)




