Home

»

Bollywood News

అతనితో పనిచెయ్యడం పీడకల: స్టార్ యాక్టర్ పై దియామీర్జా కీలక వ్యాఖ్యలు: ఇంకా ఏం చెప్పిందంటే!

Nov 19, 2026 11:52AM

అందం సైతం నేను ఇంత అందంగా ఉంటానని అని మురిసిపోయేలా చేసే ముద్దుగుమ్మ దియా మీర్జా. నటిగా బాలీవుడ్ పై తనదైన ముద్ర ఎప్పుడు ఉండేలా చేసుకుంది. మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ విజేత కూడా. ఎప్పుడు సౌమ్యంగా, హుందాగా వ్యవహరించడం దియా స్పెషల్.  అలాంటి  దియా ఒక్కసారిగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. 


ప్రముఖ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని ఉద్దేశించి దియా మీర్జా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎంతో పరిణతి కలిగిన ఈ ఇద్దరు నటుల మధ్య అసలు ఏం జరిగింది? ఇది నిజమైన వివాదమా లేక రాబోయే వెబ్ సిరీస్ కోసం పన్నిన ప్రమోషనల్ వ్యూహమా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. దియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో ఒక సంచలన పోస్ట్ పంచుకున్నారు. "ఇలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా ఒక పీడకల లాంటిది.

కనీసం మాట్లాడే పద్ధతి కూడా తెలియదు, యాటిట్యూడ్ అయితే ఏకంగా ఆకాశాన్ని తాకుతోంది. అత్యంత అభ్యంతరకరమైన పాత్ర ఇది" అంటూ ఆమె అందులో పేర్కొన్నారు. దియా చేసిన ఈ పోస్ట్ ఎక్స్ వేదికగా 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించగా, మధ్యాహ్నం కల్లా దాన్ని తొలగించడం మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆ పోస్ట్ అలాగే ఉండి 20,000కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దియా నోటి నుంచి ఇంతటి తీవ్రమైన మాటలు రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించడం మొదలుపెట్టారు.

దియా మీర్జా వ్యాఖ్యలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా అంతే వేగంగా, ఘాటుగా స్పందించడం ఈ మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. "ఒకరి యాటిట్యూడ్‌లో లోపాలు వెతకడం చాలా తేలిక.. దమ్ముంటే నా పనిలో తప్పులు వెతికి చూపించండి" అంటూ నవాజుద్దీన్ సవాల్ విసిరారు. ఇద్దరు స్టార్ నటులు బహిరంగంగా ఇలా మాటల తూటాలు పేల్చుకోవడంతో కొందరు ఇది నిజంగానే సెట్స్‌లో జరిగిన గొడవ అని భావించగా, మరికొందరు మాత్రం దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందని అంచనా వేశారు.

 

ఇది కూడా చదవండి:వైరల్ బాబోయ్ వైరల్... బయటపడ్డ సంజయ్ దత్ గత జన్మ: ఆ ఇద్దర్ని ఏసాడంట!
 

  అయితే, ఈ పోస్ట్‌లోని అసలు మెలికను కొందరు సునిశిత పరిశీలకులు పసిగట్టారు. దియా మీర్జా తన పోస్ట్‌లో 'పాత్ర' అనే పదాన్ని ప్రస్తావించడమే అందుకు ప్రధాన కారణం. వీరిద్దరూ కలిసి రోహన్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డాక్టర్ హసన్' అనే మెడికల్ డ్రామా వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. 


అమెరికాలో సూపర్ హిట్ అయిన 'హౌస్ ఎం.డి' సిరీస్ ఆధారంగా రూపొందుతున్న ఈ భారతీయ వెర్షన్, రష్యా మరియు టర్కీ తర్వాత వస్తున్న మూడవ అంతర్జాతీయ అడాప్టేషన్ కావడం విశేషం. ఈ సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ 'డాక్టర్ ఇమ్రాన్ హసన్'గా, దియా మీర్జా 'డాక్టర్ పలక్ జైన్'గా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.   ఈ పోస్ట్‌లు వైరల్ అయిన కొద్ది గంటల్లోనే జియోహాట్‌స్టార్ వేదికగా 'డాక్టర్ హసన్' టీజర్ విడుదల కావడం ఈ మొత్తం వ్యవహారానికి స్పష్టతనిచ్చింది.

సిరీస్‌లో నవాజుద్దీన్ పోషిస్తున్న మొండి, సూటిపోటి మాటలతో కూడిన వైద్యుడి పాత్ర స్వభావాన్ని ఉద్దేశించే దియా అలా పోస్ట్ చేసి ఉంటారని, ఇది ప్రేక్షకుల్లో హైప్ పెంచడానికి చేసిన పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వినయ్ ఛావల్, కేతన్ పెడ్గాంకర్ స్క్రిప్ట్, విరాట్ బసోయా సంభాషణలతో బనిజే ఆసియా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సిరీస్, డిసెంబర్ 2026లో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సోషల్ మీడియా డ్రామాతో 'డాక్టర్ హసన్' వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు నచ్చవచ్చు :రామాయణని ఆపండి: ఆ సంఘం యొక్క డిమాండ్!
మీకు నచ్చవచ్చు :పవన్ కళ్యాణ్ గురించి కోట రుక్మిణి చెప్పేసింది: అదిరిపోలా!

 

[Dia Mirza,  Nawazuddin Siddiqui,  Dr Hassan, Bollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com