
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోణె, రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం (సెప్టెంబర్ 19) దీపికా రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఈ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందులో ‘వెల్‌కమ్ బేబీ గర్ల్ (19-09-2026). ఇట్లు.. దువా, దీపిక, రణ్‌వీర్’ అని రాసుకొచ్చారు.
దీపిక, రణ్‌వీర్ దంపతులకు 2018లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం జరగ్గా, తొలి సంతానంగా 2024లో 'దువా' జన్మించింది. ఇప్పుడు దువాకు ఒక క్యూట్ చెల్లెలు తోడవ్వడం, వీరి కుటుంబంలో రెట్టింపు సంతోషాన్ని మోసుకొచ్చింది. ఈ శుభవార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: అందాల ఆడబొమ్మ.. బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.!
[Deepika Ranveer Second Baby Girl, Deepika Padukone Second Child, Deepika Padukone Baby Girl, Ranveer Singh Second Child, Deepika Padukone, Ranveer Singh, Telugu Film News, Telugu News]





