
ఆదిత్య ధర్, రణవీర్ సింగ్ నుంచి వచ్చిన ధురంధర్ సిరీస్ సృష్టించిన చరిత్ర గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే అభిమానులు, ప్రేక్షకులు మనకి తెలియని కొత్త విషయాలని కూడా చెప్పే పరిస్థితి. అంతలా ప్రభంజనం సృష్టించింది ధురంధర్. ఇక ఈ సిరీస్ ని మన భారత జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఆధ్వర్యంలో పాకిస్థాన్ లో జరిగిన సీక్రెట్ మిషన్ ఆధారంగానే ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. ఇప్పుడు అదే అజిత్ దోవల్ ఆధ్వర్యంలో జరిగిన మరో మిషన్ ఆధారంగా ఆదిత్య ధర్ మూవీ ప్లాన్ చేస్తాడా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.
ఇందుకు ప్రధాన కారణం' అజిత్ డోవల్' తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన, రొమాలు నిక్కబొడుచుకునే రహస్య మిషన్ అనుభవాన్ని రీసెంట్ గా జరిగిన 'ఐఐటీ రూర్కీ' స్నాతకోత్సవ ప్రసంగంలో తొలిసారిగా బయటపెట్టారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, దాదాపు 1970ల ప్రాంతంలో సిక్కిం భారతదేశంలో విలీనమయ్యే ప్రక్రియ జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన రోజుల్లో ఈ నమ్మశక్యం కాని ఘటన జరిగింది. ఆ సమయంలో అజిత్ డోవల్ తన 20ల పదుల వయస్సులో ఉన్న ఒక యువ ఐపీఎస్ అధికారిగా, జూనియర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కదలికలు, సరిహద్దు దాటుతున్న శత్రు కార్యకలాపాలపై నిశితంగా కన్నేసి ఉంచడం ఆయనకు అప్పగించిన ప్రధాన బాధ్యత. ఈ క్రమంలోనే సరిహద్దుల అవతల ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి 5 నుండి 6 రోజుల పర్యటన నిమిత్తం ఒక సీక్రెట్ ఏజెంట్ల బృందాన్ని సరిహద్దు వెంట అత్యంత ప్రమాదకరమైన మంచు కొండల్లోకి పంపించారు.
ఇది కూడా చదవండి: నిన్న విడుదలైన మూవీ: ఆ డైలాగ్ తో విడిపోయిన భార్య, భర్త ఆలోచనలో పడతారా!

అయితే ఊహించని విధంగా 10 రోజులు గడిచినా ఆ నిఘా బృందం తిరిగి రాలేదు. ఏ విధమైన మంచు తుఫానులు గానీ, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు గానీ జరిగిన దాఖలాలు లేకపోవడంతో డోవల్‌లో ఆందోళన తీవ్రమైంది. "నా వద్ద పనిచేస్తున్న సహోద్యోగులు అసలు బతికే ఉన్నారో లేదో తెలియదు, వారి గతి ఏమైందోనని మానవీయంగా, వృత్తిపరంగా నన్ను తీవ్ర ఆందోళన తీవ్రంగా వేధించింది" అని ఆయన గుర్తుచేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో హెడ్‌క్వార్టర్స్ నుంచి ఆయనకు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. డోవల్ పంపిన భారత సీక్రెట్ నిఘా ఏజెంట్లను చైనా సైన్యం సరిహద్దుల్లో పట్టుకుని కస్టడీలోకి తీసుకుందని హెడ్‌క్వార్టర్స్ నిర్ధారించింది. ఆ మాట వినగానే డోవల్ గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ వయసులోనే తన ఐపీఎస్ కెరీర్ పూర్తిగా నాశనమైపోయిందని, ఇక ఉద్యోగం ఊడిపోవడం ఖాయమని, తాను మరేదైనా కొత్త వృత్తిని వెతుక్కోవలసి వస్తుందని ఆయన తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
చైనా ఆర్మీ కస్టడీలో మన ఏజెంట్లను సుదీర్ఘంగా విచారించిన తర్వాత, రెండు దేశాల ఉన్నతాధికారుల స్థాయిలో జరిగిన రహస్య చర్చలు మరియు దౌత్యపరమైన సంప్రదింపుల ఫలంగా వారిని సురక్షితంగా భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఈ తీవ్ర లోపంపై వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. విచారణలో అసలు దిగ్భ్రాంతికర సత్యం వెలుగులోకి వచ్చింది. ఏజెంట్లు దారి తప్పడానికి ప్రధాన కారణం వారి తప్పు కాదు; ప్రధాన కార్యాలయం నుండి వారికి అందించిన సరిహద్దు మ్యాప్‌లు, స్కెచ్‌లలో తీవ్రమైన లోపాలు మరియు పొరపాట్లు ఉన్నాయి. ఆ తప్పు మ్యాప్‌ల వల్లే మన ఏజెంట్లు తెలియకుండా చైనా భూభాగంలోకి అడుగుపెట్టారని తేలడంతో విచారణలో డోవల్‌కు క్లీన్ చిట్ లభించింది. ఆ తర్వాత ఒక స్థానిక షేర్పా స్నేహితుడు ఇచ్చిన సలహాలు, ఈ విఫలమైన మిషన్ నేర్పిన పాఠాలే తనను భవిష్యత్తులో అత్యంత కఠినమైన జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేలా మలచాయని డోవల్ తెలిపారు. ఒక పెద్ద వైఫల్యం మరియు ప్రాణభయం కలిగించిన ఒత్తిడే ఒక గొప్ప వ్యూహకర్త నిర్మాణానికి పునాదిగా మారిందనే ఈ న్యూస్ ఒక థ్రిల్లర్ సినిమా తరహాలోనే ఉంది కదు. మరి సినిమాగా రావాలని కోరుకుందాం.
మీకు నచ్చవచ్చు : డాన్సుల్లో తోపు ఎవరు.. మీకు నచ్చిన డాన్సర్ ఎవరు.?
[Dhurandhar, Aditya Dhar, ajit Doval, RanveerSingh, Secret sikkim Mission china, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]





