Home

»

Bollywood News

Bandar: బాబీ డియోల్ ‘బందర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనురాగ్ కశ్యప్ క్రైమ్ థ్రిల్లర్ హిట్టా ఫట్టా?

Jun 5, 2026 10:52AM

బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) ప్రధాన పాత్రలో, సంచలన దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘బందర్’ (Bandar) ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది బాబీ డియోల్ నటించిన మొదటి భారీ రిలీజ్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు విలక్షణమైన కథాంశాలను ఎంచుకునే అనురాగ్ కశ్యప్ దర్శకత్వం కావడం, సుదీప్ శర్మతో కలిసి అభిషేక్ బెనర్జీ స్క్రిప్ట్ అందించడంతో సినిమాపై మొదటి నుంచీ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

ఇక థియేటర్లలో ఈ సినిమా విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే, సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే శబ్దం చేసేలా కనిపిస్తోంది. (Bandar Twitter Review)

ఈ సినిమాలో బాబీ డియోల్ ‘సమీర్ మెహ్రా’ అనే పాత్రలో కనిపించారు. ఒక సంచలన కేసు వల్ల అతని ప్రశాంతమైన జీవితం ఒక్కసారిగా ఎలా ముక్కలైపోయింది అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. సమీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ గాయత్రి (సప్నా పబ్బి) అతనిపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుంది. ఈ ఒక్క నేరారోపణ సమీర్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. సమాజం, మీడియా అతని వైపు చూసే కోణం ఎలా మారింది, చట్టాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే వివాదాస్పద మరియు సున్నితమైన అంశాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎంతో పకడ్బందీగా స్క్రీన్ పైన ఆవిష్కరించారు.

సినిమాలో బాబీ డియోల్ ప్రస్తుత లవర్ పాత్రలో సబా ఆజాద్ నటించగా, వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి, జితేంద్ర జోషి లాంటి భారీ తారాగణం ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు మరింత బలాన్ని చేకూర్చారు.

ట్విట్టర్ రివ్యూల ప్రకారం, మెజారిటీ ఆడియన్స్ ఈ సినిమాను ఒక 'అవసరమైన సినిమా' (Necessary Film) గా అభివర్ణిస్తున్నారు. ఒక నెటిజన్ సినిమాకు ఏకంగా 4.5/5 రేటింగ్ ఇస్తూ, సమాజంలో చట్టాలు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో, అది పురుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఎలాంటి పక్షపాతం లేకుండా చాలా నిష్పాక్షికంగా చూపించారని ప్రశంసించారు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్‌గా సాగిందని ప్రేక్షకులు చెప్తున్నారు. జీనియస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మార్క్ మేకింగ్ మరియు బాబీ డియోల్ అద్భుతమైన నటనకు 'మ్యాడ్ రెస్పెక్ట్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ఈ సినిమా విశేషాల గురించి నటుడు బాబీ డియోల్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం తాను రెమ్యునరేషన్ పెంచలేదని, సినిమా కథ ఎగ్జైట్ చేసినప్పుడు డబ్బు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. సాధారణంగా హీరోలు లార్జర్-ద్యాన్-లైఫ్ పాత్రలు చేయడానికి ఇష్టపడతారని, కానీ స్క్రీన్ పైన ఒక నార్మల్ గ్రౌండెడ్ క్యారెక్టర్ చేయడం చాలా సవాల్‌తో కూడుకున్న విషయమని అన్నారు. అనురాగ్ కశ్యప్ తన నుండి ఎలాంటి హంగామా ఆశించలేదని, కేవలం సహజత్వాన్ని మాత్రమే కోరుకున్నారని, ఈ సినిమా సెట్స్‌లో ప్రతిరోజూ ఒక నటన వర్క్‌షాప్‌లా సాగిందని బాబీ డియోల్ పేర్కొన్నారు. ఓవరాల్‌గా ‘బందర్’ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసే కంటెంట్‌తో పాజిటివ్ టాక్ న సొంతం చేసుకుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com