Home

»

Bollywood News

'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ట్విట్టర్ రివ్యూ.. ఒకేసారి భార్య, గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయితే?

Jun 5, 2026 9:59AM

బాలీవుడ్ మాస్ అండ్ కామెడీ చిత్రాల రారాజు, సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai). ఎన్నో వాయిదాల తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ కామెడీ చిత్రాలను అందించిన డేవిడ్ ధావన్‌కు దర్శకుడిగా ఇదే ఆఖరి సినిమా కావడం, ఆయన రిటైర్మెంట్ ప్రకటనతో ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

వరుణ్ ధావన్‌కు జోడీగా ఇద్దరు మోస్ట్ గ్లామరస్ స్టార్స్ మృణాల్, పూజ నటిస్తుండటంతో మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియా వేదికగా డిజిటల్ ఆడియన్స్, ఎక్స్ (ట్విట్టర్) యూజర్స్ తమ రివ్యూలను పంచుకుంటున్నారు.

ఈ సినిమా కథ పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ అయిన జస్వీందర్ అలియాస్ జాస్ (వరుణ్ ధావన్) చుట్టూ తిరుగుతుంది. అతను బాణీ (మృణాల్ ఠాకూర్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఐదేళ్ల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్, కెరీర్ ప్రాధాన్యతల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బని విడాకులు కోరుతుంది. ఆ తర్వాత కథ లండన్‌కు మారుతుంది. అక్కడ జస్‌కు ప్రీత్ (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్న సమయంలో ఒకే రోజు జాస్ జీవితంలో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. మాజీ భార్య బాణీ, ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ ప్రీత్ ఇద్దరూ ఒకేసారి తను గర్భవతి అనే నిజాన్ని జాస్‌కు చెప్తారు. ఒకే సమయంలో ఇద్దరు భాగస్వాములు గర్భం దాల్చడంతో జాస్ జీవితంలో మొదలైన గందరగోళం, ఆ తర్వాత వచ్చే క్రేజీ సిట్యుయేషన్స్ చుట్టూ దర్శకుడు డేవిడ్ ధావన్ తన మార్క్ హిలేరియస్ కామెడీతో కథను నడిపించారు.

సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక మైండ్ రిలాక్సింగ్, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వరుణ్ ధావన్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో వన్ మ్యాన్ షో చేశాడని, కొన్ని సీన్లలో ఓవర్ యాక్టింగ్ అనిపించినా ఓవరాల్‌గా బాగా ఎంటర్‌టైన్ చేశాడని చెప్తున్నారు. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ఇద్దరూ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు గ్లామర్‌తోనూ కట్టిపడేశారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మనీష్ పాల్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్ తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా, క్లాసిక్ సాంగ్ 'చునరి చునరి' రీమిక్స్ ట్రాక్ థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు వేయిస్తున్నాయని ఎక్స్ యూజర్స్ రాసుకొచ్చారు. రన్‌టైమ్ 136 నిమిషాలు (2 గంటల 16 నిమిషాలు) ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.

మరోవైపు ఈ సినిమాపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. లూజిక్ లేని పాతకాలపు కామెడీ సీన్లు, ఫస్ట్ హాఫ్‌లోని మొదటి 20 నిమిషాల పాటు సాగే పేలవమైన జోకులు బోర్ కొట్టించాయని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. గరం మసాలా, సాజన్ చలే ససురాల్, మై తేరా హీరో వంటి పాత చిత్రాల ఛాయలు ఎక్కువగా కనిపించాయని, క్లైమాక్స్ మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది అని అభిప్రాయపడుతున్నారు. 

అయినప్పటికీ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఇదొక బెస్ట్ స్ట్రెస్ బస్టర్ అని ప్రేక్షకులు తేల్చి చెప్తున్నారు. బాక్సాఫీస్ వద్ద వరుణ్ ధావన్ గత చిత్రం 'బోర్డర్ 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించగా, ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com